Manikandan: ‘మమ్మల్ని క్షమించండయ్యా’.. చోరీ చేసిన జాతీయ అవార్డును డైరెక్టర్‌కు తిరిగిచ్చేసిన దొంగలు

ఈ నెల ప్రారంభంలో జాతీయ అవార్డు గ్రహీత, తమిళ ప్రముఖ దర్శకుడు మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు. మణికందన్ కు ఇచ్చిన జాతీయ అవార్డును కూడా తమతో తీసుకెళ్లారు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని..

Manikandan: 'మమ్మల్ని క్షమించండయ్యా'.. చోరీ చేసిన జాతీయ అవార్డును డైరెక్టర్‌కు తిరిగిచ్చేసిన దొంగలు
Director Manikandan
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2024 | 4:05 PM

ఈ నెల ప్రారంభంలో జాతీయ అవార్డు గ్రహీత, తమిళ ప్రముఖ దర్శకుడు మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు. మణికందన్ కు ఇచ్చిన జాతీయ అవార్డును కూడా తమతో తీసుకెళ్లారు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు షురూ చేశారు. అయితే మణికందన్‌ ఇంట్లో జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది. ముఖ్యంగా అతనికి వచ్చిన జాతీయ అవార్డుకు సంబంధించిన రజత పతకం కూడా చోరీకి గురి కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త వైరల్ కావడంతో, దొంగలు ముందు జాగ్రత్త పడ్డారు. మణికందన్‌కు చెందిన విలువైన వస్తువును తిరిగి ఇచ్చారు. అలాగే క్షమాపణ లేఖ కూడా రాశారు. మణికందన్ ఇంటి నుంచి లక్ష రూపాయల నగదు, కొన్ని గ్రాముల బంగారం, ‘కడైసి వ్యవసాయాయ్’ చిత్రానికి జాతీయ అవార్డు కూడా చోరీకి గురైంది. అయితే ఇప్పుడు జాతీయ అవార్డును తిరిగిచ్చేసిన దొంగలు.. ‘దయచేసి మమ్మల్ని క్షమించండి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీ ఒక్కరికే దక్కుతుంది’ అని రాసి ఓ లేఖను రాశారు.

మణికందన్‌ స్వస్థలం మదురై జిల్లా ఉసిలంపట్టి గ్రామం. సినిమా షూటింగులు లేనప్పుడు మణికందన్ ఇక్కడే ఉంటాడు. సినిమా పని మీద చెన్నై వచ్చినప్పుడు అతని డ్రైవర్ ఇంటిని చూసుకుంటాడు. మణికందన్ చెన్నైకి వచ్చినప్పుడు ఉసిలంపాటి గ్రామంలోని అతని ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై మణికందన్‌ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా.. దర్శకుడి జాతీయ అవార్డును దొంగలు తిరిగి ఇచ్చేశారు. ప్రముఖ తమిళ చిత్ర దర్శకుల్లో ఎం మణికందన్ ఒకరు. ధనుష్ గతంలో నిర్మించిన ‘కాకా మొట్టై’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మణికందన్ దర్శకత్వం వహించిన ‘కడైసి వ్యవసాయా’ చిత్రం 2022 లో విడుదలైంది మరియు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించారు. ఈ మూవీకి పలువురి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు కూడా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి