Singer: ఇండస్ట్రీలో మరో విషాదం.. గదిలో శవమై కనిపించిన సింగర్.!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో తరచూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సింగర్ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. రాత్రి కుటుంబ సభ్యులు అంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో తరచూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సింగర్ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. రాత్రి కుటుంబ సభ్యులు అంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణం ఎప్పుడు జరిగిందో తనకు తెలియదని, తాను తన గదిలో పడుకున్నానని, చాలాసేపటివరకూ తన కుమార్తె గదిలో లైట్ వెలుగుతుండటంతో ఏమై ఉంటుందోనని వెల్లి చూడగా తన కూతురు ఉరి వేసుకొని కనిపించిందని మల్లికా తల్లి వెల్లడించారు. వెంటనే తన భర్త, స్థానికులు కలిసి మల్లికను ఆసుపత్రికి తరలించారని, అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది ఆత్యహత్య? లేదా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా.. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన మల్లికా రాజ్‌పుత్.. నటిగానూ రాణిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ మల్లిక సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. చిన్నవయసులోనే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదం అలముకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

