AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Prelims: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలంటూ డిమాండ్‌..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తు్న్న వేళ జగన్‌ సర్కార్‌ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లతోపాటు లెక్చరర్‌ పోస్టులు, టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఏ పరీక్షకు కూడా సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వకుండా వెంటవెంటనే నియామక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష సన్నద్ధతకు అదనంగా సమయం కావాలంటూ..

APPSC Group 2 Prelims: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలంటూ డిమాండ్‌..!
APPSC Group 2
Srilakshmi C
|

Updated on: Feb 15, 2024 | 5:17 PM

Share

విజయవాడ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తు్న్న వేళ జగన్‌ సర్కార్‌ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లతోపాటు లెక్చరర్‌ పోస్టులు, టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఏ పరీక్షకు కూడా సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వకుండా వెంటవెంటనే నియామక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష సన్నద్ధతకు అదనంగా సమయం కావాలని, పరీక్షను కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి14 (బుధవారం)న విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

గత ఐదేళ్లుగా యువజన సంఘాలు, నిరుద్యోగులు అనేక పోరాటాలు చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలు చేసిందన్నారు. అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు సరైన సమయం ఇవ్వకపోవడం లేదనీ, సిలబస్‌ మార్పు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పరీక్షను కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నాయకులు అమీర్, అరుణ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 కింద మొత్తం 897 పోస్టుల భర్తీకి గానూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోల్చితే ఈసారి పోస్టుల సంఖ్య పెరగడంతో నిరుద్యోగులు గ్రూప్‌ 2పై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సారి సిలబస్‌లో మార్పులు చేశారు. మారిన సిలబస్‌తో సిద్ధమయ్యేందుకు అభ్యర్ధులు అదనంగా సమయం కావాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే కమిషన్‌ గ్రూప్‌ 1 హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. ఫిబ్రవరి 25న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సమయం తక్కువగా ఉండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ గోడు విని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్ధిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.