TS Polycet 2024 Notification: తెలంగాణ పాలీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సారానికి గానూ ప్రవేశ పరీక్షల వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు..
హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సారానికి గానూ ప్రవేశ పరీక్షల వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా పాలిసెట్ రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రోజు (ఫిబ్రవరి 15) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 22వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీలు రూ. 250, జనరల్ అభ్యర్ధులు రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రూ. 100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 లోపు, రూ. 300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మే 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తామని హెడ్యూల్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
కాగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీయేట ఉన్నత విద్యా మండలి పాలీసెట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ పాలీసెట్ 2024 ప్రవేశ పరీక్ష ద్వారా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన – మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వ్యవసాయ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.