AP TET 2024: దరఖాస్తు చేసుకున్నారా? మరో రెండు రోజుల్లో ముగుస్తోన్న ఏపీ టెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. రెండు పేపర్లకు టెట్ పరీక్ష ఉంటుంది. 1-5 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు పేపర్-1(ఎ, బి), 6-8 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. రెండు పేపర్లకు టెట్ పరీక్ష ఉంటుంది. 1-5 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు పేపర్-1(ఎ, బి), 6-8 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు పేపర్-2 (ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు తప్పనిసరిగా డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 185 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రం బయట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో మరో 22 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 18, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.750లు చెల్లించాలి.
కేటగిరీ వారీగా ఉత్తీర్ణతా మార్కులు ఇలా..
- ఓసీ (జనరల్) అభ్యర్ధులకు ఉత్తీర్ణత మార్కులు: 60 శాతం మార్కులు ఆపైన
- బీసీ అభ్యర్ధులకు ఉత్తీర్ణత మార్కులు: 50 శాతం మార్కులు ఆపైన
- ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఉత్తీర్ణత మార్కులు: 40 శాతం మార్కులు ఆపైన
పరీక్ష విధానం ఇలా..
టెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2024.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2024.
- ఆన్‌లైన్ మాక్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 19, 2024.
- హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 23 నుంచి, 2024
- టెట్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9, 2024 వరకు
- ప్రాథమిక ‘కీ’ విడుదల తేదీ: మార్చి 10, 2024.
- అభ్యంతరాల స్వీకరణ తేదీ: మార్చి 11, 2024.
- తుది ‘కీ’ విడుదల: మార్చి 13, 2024.
- ఫలితాల ప్రకటన తేదీ: మార్చి 14, 2024.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.