UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ ఏడాది మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 1,056 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..

UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ ఏడాది మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే
UPSC CSE 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2024 | 2:13 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 1,056 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్.. వంటి మొత్తం 21 సర్వీసులకు గానూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2024 ద్వారా నియామక ప్రక్రియ చేపడుతోంది.

అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 02, 1992 నుంచి ఆగస్టు 01, 2003 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్‌ కేగగిరీకి ఆరు సార్లు, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అటెంప్ట్‌ చేసే అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి పరిమితి లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద ఓబీసీ రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం..

మొత్తం మూడు దశల్లో సెలక్షన్‌ ప్రాసెస్‌ ఉంటుంది. తొలిదశ అయిన ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కుల చొప్పున ఉంటుంది. ఒకటే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధిస్తే సరిపోతుంది. రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇలా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 14, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 05, 2024.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 06, 2024 నుంచి మార్చి 12, 2024 వరకు
  • ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 26, 2024.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.