AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato: ‘హారిఫిక్‌ ఎక్స్‌పీరియన్స్‌.. అస్సలు ఊహించలేదు’ జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి..!

ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం నేటి కాలంలో గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంతోపాటు నచ్చిన ఆహారాన్ని నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే, ఇలా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీల నాణ్యతపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్‌లలో పురుగులు వచ్చాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి మరొక సంఘటన..

Zomato: 'హారిఫిక్‌ ఎక్స్‌పీరియన్స్‌.. అస్సలు ఊహించలేదు' జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి..!
Zomato Online Food Delivery
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2024 | 4:10 PM

ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం నేటి కాలంలో గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంతోపాటు నచ్చిన ఆహారాన్ని నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే, ఇలా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీల నాణ్యతపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్‌లలో పురుగులు వచ్చాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆధారిత రెస్టారెంట్ నుంచి బుధవారం జొమాటో (Zomato) ద్వారా ఆర్డర్ చేసిన నూడిల్స్‌లో చచ్చిన బొద్దింక కనిపించిందంటూ ఓ కస్టమర్‌ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

సోనై ఆచార్య అనే యూజర్‌ ‘ఆటీ ఫగ్స్’ అనే రెస్టారెంట్‌ నుంచి జపనీస్ రామెన్ ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్ చేసింది. తనకు అందిన నూడిల్ సూప్‌లో చనిపోయిన బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ‘జొమాటో ఆర్డర్ చేయడం ద్వారా ‘హారిఫిక్‌ ఎక్స్‌పీరియన్స్‌’ పొందాను. ఆంటీ ఫగ్స్ అనే రెస్టారెంట్‌ నుంచి జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేసాను. కానీ నాకు అందిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది! ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అసహ్యంగా ఉంది. ఇక్కడ ఫుడ్‌ నాణ్యత తీవ్రంగా నిరాశ పరిచింది’ అంటూ తన పోస్టులో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మహిళ ఫిర్యాదుపై జొమాటో వెంటనే స్పందించింది. ‘హాయ్, దురదృష్టకర సంఘటనపై చింతిస్తున్నాం. దీనిపై పరిశీలిస్తున్నాం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. దీనిపై మేము వీలైనంత త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం’ అని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా మిస్‌ ఆచార్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఫుడ్ డెలివరీ కంపెనీ ఆర్డర్ కోసం చెల్లించిన రూ.320 రీఫండ్‌ చేసినట్లు పేర్కొంది. తరచూ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలపై ఇలాంటి ఫిర్యాదులు రావడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.