AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trigrahi Yoga: కుంభరాశిలో ఏర్పడనున్న త్రిగాహి యోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు.. మీరున్నారా చెక్ చేసుకోండి..

2024 ఏడాది శుభప్రదంగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో అనేక గ్రహాలు రాశులను మార్చుకుంటున్నాయి. దీంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడనుంది. ఈ యోగానికి   జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికే కుంభ రాశిలో శని సంచరిస్తున్నాడు.. మార్చి 7న శుక్రుడు, 15వ తేదిన కుజుడు తమ గమనాన్ని మార్చుకుని కుంభరాశిలో అడుగు పెట్టనున్నారు. కుంభ రాశిలో ఈ మూడు గ్రహాలు కలవనున్నాయి.

Trigrahi Yoga: కుంభరాశిలో ఏర్పడనున్న త్రిగాహి యోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు.. మీరున్నారా చెక్ చేసుకోండి..
HoroscopeImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Feb 18, 2024 | 3:30 PM

Share

ప్రతి వ్యక్తికీ తమ జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. దీంతో జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తారు. రాశులు, గ్రహాల గమనం ఆధారంగా జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీంతో  2024 ఏడాది శుభప్రదంగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో అనేక గ్రహాలు రాశులను మార్చుకుంటున్నాయి. దీంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడనుంది. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఇప్పటికే కుంభ రాశిలో శని సంచరిస్తున్నాడు.. మార్చి 7న శుక్రుడు, 15వ తేదిన కుజుడు తమ గమనాన్ని మార్చుకుని కుంభరాశిలో అడుగు పెట్టనున్నారు. కుంభ రాశిలో ఈ మూడు గ్రహాలు కలవనున్నాయి. దీంతో  త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ త్రిగ్రహి యోగంతో కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుందని  జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరికీ అదృష్టాన్ని తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ త్రిగ్రాహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభించి ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు తమ పని తనంతో ప్రశంసలను అందుకుంటారు.  ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి గుడ్ న్యూస్ వినిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయికతో అనేక లాభాలు పొందుతారు.  ఎటువంటి పనులు ప్రారంభించినా సక్సెస్ అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిష్కారం కాని పనులు పరిష్కారమవుతాయి. అప్పు తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు.  అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి: ఈ త్రిగ్రహి యోగం వలన ఈ రాశికి చెందిన వారికి అనేక లాభాలను అందిస్తుంది. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. ఆర్ధికంగా శుభప్రదంగా ఉంటుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషంగా సాగుతుంది. అన్ని రకాలుగా ఆదాయం పెరిగే అవకాశాలు పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు