Viral News: పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షఅడ్మిట్ కార్డ్.. సన్నీ లియోన్ ఫోటో
కనౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలోని సోనాశ్రీ ఉమెన్స్ కాలేజీలో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షా కేంద్రంలో సినీ నటి సన్నీలియోన్ చిత్రాన్ని అభ్యర్థి అంకిత్ అడ్మిట్ కార్డ్‌పై అతికించిన సంఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి మహోబా జిల్లా నివాసి. అంకిత్ ఫోటో స్థానంలో సన్ని లియోన్ ఉంది. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్‌లోని యుపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పరీక్షలోని అడ్మిట్ కార్డ్‌లో సన్నీ లియోన్ చిత్రం ఉంది. ప్రస్తుతం ఈ అడ్మిట్ కార్డు పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కనౌజ్ జిల్లాలో పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష మొదటి రోజున హాజరైన అభ్యర్థి అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అడ్మిట్ కార్డు విషయంలో అధికారులు అయోమయంలో పడ్డారు. అదే సమయంలో ఈ అడ్మిట్ కార్డ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కనౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలోని సోనాశ్రీ ఉమెన్స్ కాలేజీలో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షా కేంద్రంలో సినీ నటి సన్నీలియోన్ చిత్రాన్ని అభ్యర్థి అంకిత్ అడ్మిట్ కార్డ్‌పై అతికించిన సంఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి మహోబా జిల్లా నివాసి. అంకిత్ ఫోటో స్థానంలో సన్ని లియోన్ ఉంది. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
అడ్మిట్ కార్డుపై రాసి ఉన్న నంబర్‌పై ఫోన్‌లో సమాచారం తీసుకున్న అంకిత్.. పబ్లిక్ సర్వీస్ సెంటర్ నుండి దరఖాస్తును నింపినట్లు చెప్పాడు. అయితే తన ఫోటోను ఎలా మార్చారనేది తెలియని పేర్కొన్నాడు. అయితే అడ్మిట్ కార్డు లో సన్నీ లియోన్ ఫోటో ఉండడంతో అకింత్ పరీక్షకు హాజరు కాలేదు. ఈ అడ్మిషన్ లెటర్‌లో పేర్కొన్న చిరునామా ముంబై. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో సొంత జిల్లా కన్నౌజ్ అని పేర్కొన్నాడు. ఈ అడ్మిట్ కార్డులో అభ్యర్థులెవరూ పరీక్షకు హాజరు కాలేదని కళాశాల యాజమాన్యం తెలిపింది.
ఈ విషయం స్థానిక అధికారుల దృష్టికి వెళ్లగా.. అడ్మిషన్ లెటర్‌లో సవరణలు చేసినట్లు తెలిపారు. మిగిలిన అంశాలపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. కనౌజ్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగింది. తొలిరోజు 10 పరీక్షా కేంద్రాల్లో 9464 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..