Kitchen Hacks: ఇంట్లో బల్లులు చక్కర్లు కొడుతున్నాయా.. ఈ మొక్కలను పెంచండి.. కంటికి కనిపించవు

ఇంట్లో విద్యుత్ దీపాల వెలుగుకి కీటకాలు, రెక్క పురుగులు వస్తే వాటిని తినడానికి బల్లులు వస్తాయి. ఇంట్లో బల్లులు భయంతో ఇబ్బంది పడుతుంటే కొందరు వెల్లుల్లి, కలరా ఉండలు వాటిని ఉపయోగిస్తారు. వీటితో పాటు బల్లులను తరిమికొట్టడంలో సహాపడే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల నుంచి వచ్చే వాసన బల్లులను తరిమి కొట్టడంలో సహాయపడతాయి. ఈ రోజు ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం.. 

Kitchen Hacks: ఇంట్లో బల్లులు చక్కర్లు కొడుతున్నాయా.. ఈ మొక్కలను పెంచండి.. కంటికి కనిపించవు
Get Rid Of Lizards
Follow us

|

Updated on: Feb 18, 2024 | 2:49 PM

సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బల్లులు కనిపిస్తాయి. గోడలమీద, తలుపులు, కిటికీలు  వంటి వాటిమీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా సరే బల్లి కనిపిస్తే చాలు ఏదో భూతాన్ని చూసినట్లు భయపడి నానా హంగామా చేస్తారు. వాటిని చూడడానికి కూడా ఇష్టపడరు. దీంతో వాటిని ఇంటి నుంచి బయటకు పంపడానికి  ష్.. ష్ అంటూ అరుస్తుంటాం. ఎంత అరిచినా, గీ పెట్టినా అవి ఒక పట్టాన కదలవు. ముఖ్యంగా ఇంట్లో విద్యుత్ దీపాల వెలుగుకి కీటకాలు, రెక్క పురుగులు వస్తే వాటిని తినడానికి బల్లులు వస్తాయి. ఇంట్లో బల్లులు భయంతో ఇబ్బంది పడుతుంటే కొందరు వెల్లుల్లి, కలరా ఉండలు వాటిని ఉపయోగిస్తారు. వీటితో పాటు బల్లులను తరిమికొట్టడంలో సహాపడే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల నుంచి వచ్చే వాసన బల్లులను తరిమి కొట్టడంలో సహాయపడతాయి. ఈ రోజు ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

లెమన్ గ్రాస్:  ఇది ఆయుర్వేద ఔషధంగానే కాదు బల్లులను ఇంటి నుండి తరిమికొట్టడానికి సహాయపడుతుంది. నిమ్మ గడ్డిలో ట్రోనిల్లా అనే ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. ఈ వాసన బల్లులకు అంతగా నచ్చదట. దీంతో బల్లులు నిమ్మ గడ్డి ఉన్న చోట నుంచి పారిపోతాయట.. కనుక బల్లులను ఇంటి నుంచి దూరంగా ఉంచేందుకు ఇంట్లో నిమ్మ గడ్డిని నాటవచ్చు. ఇది రుచికి పుల్లగా ఉంటుంది.

పుదీనా : ఇది ఆహారంలో అదనపు రుచిని కమ్మటి వాసనను ఇవ్వడమే కాదు.. దీని ఘాటైన వాసనకు బల్లులను కూడా తరిమి కొడుతుందట. పుదీనాలో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. ఈ స్మెల్ కు ఒక్క బల్లి కూడా ఇంట్లో ఉందట. కనుక ఇంట్లో నుంచి బల్లులు పారిపోవాలంటే పుదీనా ను పెంచుకోండి.

ఇవి కూడా చదవండి

బంతి మొక్క: బంతి పువ్వులు పూజకు మాత్రమేకాదు అందాన్ని కూడా ఇస్తాయి. బంతి మొక్క బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టడంలో మంచి సహాయకారి అని చెబుతున్నారు. బంతి పువ్వుల్లో పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. ఇవి వెదజల్లే వాసన కారణంగా బల్లులు దరి చేరవట.

లావెండర్ : ఈ మొక్క నుంచి వచ్చే సువాసన ఇంట్లోని బల్లులను దూరంగా పారిపోయేలా చేస్తుంది. లావెండర్ పువ్వుల్లో లినాలూల్ ,మోనోటెర్పెన్స్ వంటి రసాయన సమ్మేళనాలున్నాయి. ఈ మొక్క నుంచి స్మెల్ కు ఇంట్లోని బల్లులు దరి చేరవు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఇక్కడ ఇచ్చిన ఈ కథనం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. ఇది  సరైనది అని మేము ధృవీకరించడం లేదు