Daredevils: మన దేశంలో ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక సాహస యాత్రే.. ధైర్యవంతులకు మాత్రమే..

కొంతమంది ప్రకృతిలో అందాలను.. కొత్త ప్రాంతాలను చూడడానికి ఇష్టపడతారు.. మరికొందరు ప్రయాణాలను ఇష్టపడతారు.  దీంతో ఎప్పుడు సెలవులు వచ్చినా కొత్త ప్రాంతాల అన్వేషణలో గడిపేస్తారు. అయితే ఏదైనా కొత్త ప్రాంతాలను సందర్శించే ముందు భద్రతపై మరింత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మన దేశంలో సాంస్కృతిక వైవిధ్య భరితమైన అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు.. ప్రత్యేకమైన సహజ ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి.

|

Updated on: Jan 13, 2024 | 4:39 PM

కొన్ని ప్రదేశాలకు వెళ్లడం వలన ప్రశాంతత లభిస్తే.. మరికొన్ని ప్రదేశాలు భయంకరమైన అనుభవాన్ని అందిస్తాయి. సాహస యాత్రలు ఇష్టపడేవారు వెళ్లడం ఇష్టపడేవారికి మన దేశంలో కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలున్నాయి. ఈ రోజు భారతదేశంలోని కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాల గురించిన వివరాలు తెలుసుకుందాం.. 

1 / 6
ఫుగ్తాల్ మఠం: లడఖ్‌లోని జంస్కర్‌లో ఫుగ్తాల్ మఠం ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి వెళ్లే రహదారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ మఠం పర్వత గుహల మధ్య నిర్మించబడింది. ఇక్కడికి చేరుకోవాలంటే ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి కొండపైకి స్థానికులు మినహా పర్యాటకులు ఎక్కడం అంత సులువు కాదు.

2 / 6
కొల్లి కొండలు: కొల్లి కొండలను కొల్లిమలై అని కూడా అంటారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఈ కొండకు భిన్నమైన కథ ఉంది. ఏటవాలు మార్గాల వల్ల ఇక్కడి ప్రయాణం చాలా ప్రమాదకరమని చెబుతారు. చాలా కాలం క్రితం పర్వత శిఖరంపై ఒక విచిత్రమైన బొమ్మ కనిపించిందని కొందరు అంటారు. తర్వాత ఈ ప్రదేశం ప్రమాదకరమైన ప్రదేశాల జాబితాలోకి చేర్చబడింది. అలాగే అక్కడికి వెళ్లే రోడ్డు కూడా గుంతలతో నిండిపోయి ఉంది. 

3 / 6
చంబల్ లోయ: చంబల్ లోయ ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం. ఒకప్పుడు ఈ లోయ బందిపోట్లకు అడ్డాగా ఉండేది. నేటికీ ప్రజలు భయంతో ఇక్కడికి రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. ఇది అనేక రహస్యమైన గుహలు, అడవులు, భారీ నదులుతో మాత్రమే కాదు ఈ లోయ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిలయం అని చెబుతారు.

4 / 6
బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా దేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సహజ దృశ్యాలతో పాటు అతి ప్రాచీనమైన గిరిజన సంస్కృతిని కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే బస్తర్ ప్రమాదకరంగా ఖ్యాతికెక్కడానికి కారణం నక్సలిజం. అయితే.. బస్తర్‌లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే నక్సల్స్ ప్రాభల్యం ఉంటుంది. కనుక బస్తర్ వెళ్లాలనుకుంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సమాచారం ఇవ్వాలి. వారు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి వెళ్లకూడదో చెబుతారు.

5 / 6
రూప్‌కుండ్ సరస్సు: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఈ రహస్యమైన సరస్సు ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 16,499 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రర్యాటక ప్రాంతాల్లో  ఒకటి. అయితే  ఇక్కడకు వెళ్లాలంటే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. కాలిబాట దట్టమైన అడవులతో నిండినందున..  ప్రకృతిలో అనూహ్యమైన మార్పులను కలుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ సరస్సు నుంచి వందలాది మానవ అస్థిపంజరాలు బయల్పడ్డాయి. దీనిని అస్థిపంజరం సరస్సు అని కూడా పిలుస్తారు. 

6 / 6
Follow us