Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahotsav: ఈ నెల 27 వరకూ జరగనున్న తాజ్ మహోత్సవ్.. ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలు.. భారీగా పర్యాటకులు

తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవం శనివారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ లాంటివి ఏర్పాటు చేశారు. తాజ్ మహోత్సవ్‌లో.. ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈసారి యమునా మహా హారతి నిర్వహించనున్నారు.

Taj Mahotsav: ఈ నెల 27 వరకూ జరగనున్న తాజ్ మహోత్సవ్.. ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలు.. భారీగా పర్యాటకులు
Taj Mahotsav
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2024 | 2:16 PM

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. ప్రేమకు చిహ్నంగా ప్రపంచ ఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతారు. తాజాగా తాజ్ మహోత్సవ్‌తో ఆగ్రాలో సందడిగా మారింది. ఏటా.. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం జరిగే తాజ్ మహోత్సవ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవం శనివారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ లాంటివి ఏర్పాటు చేశారు. తాజ్ మహోత్సవ్‌లో.. ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈసారి యమునా మహా హారతి నిర్వహించనున్నారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

పది రోజుల పాటు జరిగే తాజ్ మహోత్సవ్ చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ప్రముఖ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తాజ్ మహోత్సవ్‌లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూడొచ్చు. ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ తదితర ఈవెంట్‌లు కూడా ఉంటాయి. ఇవి కాకుండా దేశ నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శన‌లో ఉంచుతారు. మన నూమాయిష్‌లాగే.. ఇక్కడ కూడా వివిధ రాష్ట్రాల షాపులు, ఫుడ్ జోన్ లాంటివి ప‌ర్యాట‌కులకు అందుబాటులో ఉంటాయి. తాజ్ మహోత్సవ్ ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. విదేశీ పర్యాటకులకు,  ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..