Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bee Warriors: భారత సరిహద్దుకు రక్షకులుగా తేనెటీగలు.. బీఎస్‌ఎఫ్‌తో కలిసి కాపలా.. ఎక్కడంటే

బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు భారతదేశంలో సాధారణం. తరచుగా ఇలా దేశంలో చొరబడుతున్న వ్యక్తులు సరిహద్దులో పట్టుబడతారు. ఇక్కడి సరిహద్దులపై నిఘా ఉంచే బాధ్యత సరిహద్దు భద్రతా దళంపై ఉంది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చే బంగ్లాదేశ్ పౌరులను ఇక్కడ సైనికులు తరచుగా అదుపులోకి తీసుకుంటారు. ఇప్పుడు చొరబాట్లు జరగడానికి వీలులేకుండా బీఎస్ఎఫ్ సన్నాహాలు చేసింది. ఎవరైనా ముళ్ల తీగను దాటడానికి ప్రయత్నిస్తే తేనెటీగలు వారి ప్రయత్నాన్ని తిప్పి కొడతాయి. 

Bee Warriors: భారత సరిహద్దుకు రక్షకులుగా తేనెటీగలు.. బీఎస్‌ఎఫ్‌తో కలిసి కాపలా.. ఎక్కడంటే
Bee Warriors
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2023 | 11:04 AM

భారత సరిహద్దుల్లోకి ఎవరైనా చొరబడితే ఇప్పుడు తేనెటీగలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ ఇందుకోసం ప్లాన్ సిద్ధం చేసింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో  ఈ మేరకు పనులు ప్రారంభించారు. సరిహద్దులోని ముళ్ల తీగలపై తేనెటీగల పెంపకం జరుగుతోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఇది విజయవంతమైతే భారీ ఎత్తున తేనెటీగల పెంపకాన్ని చేపట్టనున్నారు.

బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు భారతదేశంలో సాధారణం. తరచుగా ఇలా దేశంలో చొరబడుతున్న వ్యక్తులు సరిహద్దులో పట్టుబడతారు. ఇక్కడి సరిహద్దులపై నిఘా ఉంచే బాధ్యత సరిహద్దు భద్రతా దళంపై ఉంది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చే బంగ్లాదేశ్ పౌరులను ఇక్కడ సైనికులు తరచుగా అదుపులోకి తీసుకుంటారు. ఇప్పుడు చొరబాట్లు జరగడానికి వీలులేకుండా బీఎస్ఎఫ్ సన్నాహాలు చేసింది. ఎవరైనా ముళ్ల తీగను దాటడానికి ప్రయత్నిస్తే తేనెటీగలు వారి ప్రయత్నాన్ని తిప్పి కొడతాయి.

తేనెటీగలను ఏర్పాటు చేస్తున్న బీఎస్ఎఫ్

భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య 4.96 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. ఇక్కడ ముళ్ల తీగలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ముళ్ల తీగలపై తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో బీఎస్ఎఫ్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఛప్రా, బాన్‌పూర్‌, కడిపూర్‌, అంచాస్‌ సరిహద్దుల్లో కొన్నిచోట్ల తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగం

వైబ్రంట్ విలేజ్ తరహాలో తేనెటీగల పెంపకం పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద, భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. తద్వారా తేనె టీగలు చొరబాటు ప్రయత్నాలను తగ్గిస్తాయో లేదో చూడాల్సి ఉంది. కృష్ణగంజ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 20 తేనే తీగల  బాక్సులను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇక్కడ ఈ పెట్టెల నిర్వహణ బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకుంటారు. తేనెను సేకరించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. దీనివల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు.

తేనెటీగలను ఎలా పెంచుతారంటే

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 200 బాక్సుల తేనెటీగల పెంపకాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం సరిహద్దులోని ముళ్ల కంచెలో తేనెటీగలు ఇష్టపడే కొన్ని పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇక్కడే తేనెటీగల పెంపకం పెట్టె ఇక్కడ ఉంచుతున్నారు. తేనెటీగలకు ఇక్కడ వాతావరణం చాలా సహజంగా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

చొరబాట్లను ఎలా ఆపుతారంటే..

తేనేతీగలను పెంచే బాక్సులను బార్డర్‌లో ఉంచుతారు. సరిహద్దులో ఏదైనా అనుచిత కార్యకలాపాలకు పాల్పడితే.. తేనెటీగల బాక్సులు కదిలి సంబంధిత వ్యక్తిపై దాడి చేస్తాయి. బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ బెంగాల్ బోర్డర్ డీఐజీ మాట్లాడుతూ.. తేనెటీగలు.. ముళ్ల తీగ దగ్గరకు వచ్చేవారికి పెద్ద ప్రమాదమని చెప్పారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద పనులు జరుగుతున్నాయి. ప్రయోగం విజయవంతమైతే రానున్న  రోజుల్లో ఈ తేనే తీగల పెట్టెల పెంపకాన్ని ఇతర ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..