AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Case: పిల్లనిచ్చిన అత్తను చంపిన అల్లుడు.. 28 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ నిందితుడు

భార్య విడాకుల దావా వేయడంతో ఆగ్రహించిన భర్త.. భార్య, బామ్మర్ది, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త మరణించింది. దీంతో పరారైన హంతకుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని ఎస్‌8 అరుంబాక్కం ఠాణా పరిధి నంగనల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న పట్టాజోషి అనే వ్యక్తి మరో కంపెనీలో..

Murder Case: పిల్లనిచ్చిన అత్తను చంపిన అల్లుడు.. 28 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ నిందితుడు
Chennai Murder Case
Srilakshmi C
|

Updated on: Dec 27, 2023 | 10:34 AM

Share

చెన్నై, డిసెంబర్ 27: భార్య విడాకుల దావా వేయడంతో ఆగ్రహించిన భర్త.. భార్య, బామ్మర్ది, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త మరణించింది. దీంతో పరారైన హంతకుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని ఎస్‌8 అరుంబాక్కం ఠాణా పరిధి నంగనల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న పట్టాజోషి అనే వ్యక్తి మరో కంపెనీలో టెలిమార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇందిర (21)తో ప్రేమలో పడ్డాడు. జూలై 1994లో వివాహం చేసుకున్నారు. అయితే, వివాహమైన కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉండడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇందిర విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో కోపోధ్రిక్తుడైన హరిహర పట్టజోషి భార్య ఇందిర, అత్త రమా(48), బామ్మర్ది కార్తిక్‌లపై కత్తితో దాడి చేశాడు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమా అదేరోజు మృతి చెందింది. భార్య, బావ తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. అయితే నిందితుడు పట్టజోషి ఆ తర్వాత చెన్నై పారిపోయాడు. 1995 నుండి, పట్టజోషి ఒడిశా, సూరత్‌లో వివిధ ప్రదేశాలలో ఉన్నాడు. తొలినాళ్లలో అతను అస్కాలోని ఒక స్నేహితుని ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ అతను మరొక మహిళను 2001లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె సంతానం. తర్వాత బెర్హంపూర్‌లోని సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో, తర్వాత కేంద్రపరాలోని బజాజ్ బీమా కంపెనీలో సేల్స్‌మెన్‌గా, బెర్హంపూర్‌లోని చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. గత 28 సంవత్సరాలలో, బెర్హంపూర్ సమీపంలోని ప్రదేశాలలో అనేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. అయితే నిందితుడు తరచూ ఇల్లు, ఉద్యోగం మారుతున్నందున అతన్ని పోలీసులు అరెస్టు చేయలేకపోయాడు.

వారం రోజుల క్రితం చెన్నైలోని ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు సభ్యుల పోలీసు బృందం సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో గోసానినుగావ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బెర్హంపూర్ పోలీసుల సహాయం కోరింది. గోసానినుగావ్ ఇన్‌స్పెక్టర్ స్మ్రుతి నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సమన్వయంతో పనిచేసి అనుమానిత ప్రాంతాలన్నింటినీ పరిశీలించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత నిందితుడు బ్రహ్మపురలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితుడు పట్టుబడినట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో