Covid New Variant: డేంజర్‌బెల్ మోగిస్తున్న కొత్త వేరియంట్.. మాస్క్ తప్పనిసరి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఈ మేరకు నిపుణులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సోకిన వారు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి సోకిన వారికి 7 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉన్న ..
దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్ డేంజర్ బెల్ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం కేరళ రాష్ట్రంలో కొత్తగా 74 కోవిడ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దక్షిణ కన్నడ, మైసూరు జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కో బాధితుడు. బెంగళూరులో ఇవాళ కొత్తగా 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హాసన్ 4, బెంగళూరు రూరల్ జిల్లాలో 4, చిక్కబల్లాపూర్ 3, మాండ్య, మైసూర్ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటకలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అల ఆలాగే బాధితులకు 7 రోజుల క్వారంటైన్ విధించింది. JN.1 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 464, బెంగళూరులో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 376, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1.15%.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఈ మేరకు నిపుణులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సోకిన వారు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి సోకిన వారికి 7 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని మంత్రి సూచించారు.
మాస్క్ ధరించడం మంచిదని, ఇందుకు సంబంధించి నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు రోజూ 5 వేల కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. జిల్లా, తాలూకా ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ కోసం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
60 ఏళ్లు పైబడిన వారు మాస్క్ ధరించడం తప్పనిసరి
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలా మంది పర్యాటకులు వస్తారు కాబట్టి 60 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇండోర్ ఈవెంట్‌లకు హాజరైన వారిని కోవిడ్-19 లక్షణాల కోసం పరీక్షించి, లోపలికి అనుమతించాలి. 60 ఏళ్లు పైబడిన వారు బహిరంగ కార్యక్రమాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి