Telangana Politics: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. తెలంగాణలో నెక్ట్స్ లెవల్ పాలిటిక్స్.. తగ్గేదెలే అంటోన్న నేతలు..
తెలంగాణ దంగల్‌లో ఓ లెక్క.. ఇప్పుడు అంతకు మించిన లెక్క.. సభలో- బయట కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ మధ్య సవాళ్లు- ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వర్సెస్ 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పరిపాలనపై ఇటూ అటూ విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి. డైలాగ్ వార్‌తో సభ మార్మోగింది. మాటల హీట్ హీట్ పెరిగి పెరిగి మ్యాటర్ కరెంట్ ఒప్పందాలు.. ప్రాజెక్టులపై జ్యూడిషియల్ ఎంక్వయిరీపై వరకు వెళ్లింది.
తెలంగాణ దంగల్‌లో ఓ లెక్క.. ఇప్పుడు అంతకు మించిన లెక్క.. సభలో- బయట కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ మధ్య సవాళ్లు- ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వర్సెస్ 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పరిపాలనపై ఇటూ అటూ విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి. డైలాగ్ వార్‌తో సభ మార్మోగింది. మాటల హీట్ హీట్ పెరిగి పెరిగి మ్యాటర్ కరెంట్ ఒప్పందాలు.. ప్రాజెక్టులపై జ్యూడిషియల్ ఎంక్వయిరీపై వరకు వెళ్లింది. గత ప్రభుత్వం పరిపాలనపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం సంధిస్తే.. ధీటుగా స్వేదపత్రాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్‌ఎస్. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఖర్చుపై బీఆర్‌ఎస్ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్.
స్వేదపత్రంపై తన స్టయిల్‌లో కౌంటరేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వన్ బై వన్ అన్ని నిజాలను ప్రజలకు ముందుకు తెస్తామన్నారు.. ప్రాజెక్టుల్లో అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు. శ్వేతపత్రం మేం సృష్టించింది కాదు.. అధికారిక లెక్కలే.. 10 సంవత్సరాలలో లక్షలకోట్లు దోచుకున్నారన్నారు. మరికొన్ని రోజుల్లో మీ దోపిడీ పత్రాల్ని బయటపెడతామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని.. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలివ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చుచేసినా.. పూర్తిచేయలేదన్నారు. ప్రతీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గతంలో సంక్షేమపథకాలు.. ఎమ్మెల్యేల అనుచరులకే దక్కేవని.. ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తామన్నారు.
సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా కాంగ్రెస్ ప్రాజెక్టుల ఆపరేషన్ చేపట్టింది. ఈనెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను తెలుసుకుంటారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలపై కూడా మంత్రులు ఫోకస్ చేస్తారు. దీంతోపాటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్‌పై మంత్రులు సమీక్షిస్తారు.
ఓవైపు నిజనిర్దారణ కోసం మంత్రుల బృందం ప్రాజెక్టుల బాట పడుతోంది. మరోవైపు హామీలు అమలు ఏమాయె…అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్.
అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ తన అస్త్రంగా మలుచుకోబోతుంది. 15 రోజులు కాదు అందుకు నాలుగు రెట్లు సమయం.. 60 రోజులు వెయిట్ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్లి.. ప్రజలతో కలిసి ఉద్యమించేలా కార్యచరణ రూపొందిస్తోంది బీఆర్‌ఎస్.
ఆరు గ్యారంటీలతో పాటు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 412 హామీలును ప్రకటించింది. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో 60 రోజులు వరకు వెయిట్ చేయడం మొదలి అంచె. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 412 హామీల్లో సాధ్యాసాధ్యాలేంటి? నిదులు ఎలా తెస్తారు? హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది వుందా? ఇలాంటి అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీనికూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జిల్లాల వారీగా పూర్తిస్థాయి పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి గ్రామస్థాయి వరకు కొత్త కమిటీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది.
14 ఏళ్లు తెలంగాణ ఉద్యమం చేసిన ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేయాలనేది బీఆర్‌ఎస్ కొత్త ఎజెండా.. 60 రోజుల తర్వాత ఆరు గ్యారెంటీ లపై ప్రజల తరఫున ప్రశ్నించేందుకు రెడీ అవుతుందిగులాబీ దళం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..