Minister Sridhar Babu: కొత్త రేషన్ కార్డులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన.. ప్రజా పాలన కార్యక్రమంపై సమీక్ష
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ప్రజా పాలన కార్యక్రమంపై చర్చించారు. ఇందులో ప్రజలు ఏ ఏ సంక్షేమ పథకాలకు అర్హులు, వేటికి అనర్హులు అనే విషయాలు పరిశీలించాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ప్రజా పాలన కార్యక్రమంపై చర్చించారు. ఇందులో ప్రజలు ఏ ఏ సంక్షేమ పథకాలకు అర్హులు, వేటికి అనర్హులు అనే విషయాలు పరిశీలించాలన్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల అంశాన్ని తెరపైకి తెచ్చారు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. కొన్ని అవాస్తవాలు, పుకార్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రేషన్ కార్డులపై వస్తున్న వార్తలపై స్పందించారు. ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
ఈనెల 28 నుంచి జరిగే ప్రజా పాలన కార్యక్రమంలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. గతంలో రేషన్‌కార్డులకు కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం లాంటివి జరుగలేదన్నారు. తమ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందన్నారు. లబ్ధి పొందాలనుకునే వారి డేటా సేకరణ కోసమే ప్రజా పాలన కార్యక్రమం అని స్పష్టం చేశారు. ఇందులో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లుతో పాటూ మరిన్ని సంక్షేమ పథకాలు కావాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి, అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25వేల దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..