BRS Party: లోక్‌సభ ఎన్నికలపై BRS ఫుల్ ఫోకస్.. పవర్ ఫుల్ స్ట్రాటజీతో అభ్యర్థుల ప్రకటన..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతూ.. ఫుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా చేవేళ్ల లోక్ సభ స్థానానికి సంబంధించి సమీక్ష నిర్వహించింది. మరోసారి రంజిత్ రెడ్డిను చేవేళ్ల నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతూ.. ఫుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా చేవేళ్ల లోక్ సభ స్థానానికి సంబంధించి సమీక్ష నిర్వహించింది. మరోసారి రంజిత్ రెడ్డిను చేవేళ్ల నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంటుందని.. కార్యకర్తలంతా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచించారు.
చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టమైన సూచనలు చేశారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరగగా.. పలు స్పష్టమైన సూచనలు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదేస్థాయిలో.. అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కోరారు. కాగా, ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..