CM Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి ప్రధానిని కలిసిన రేవంత్.. మోదీ ముందుంచిన విన్నపాలివే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలిశారు రేవంత్ రెడ్డి. ఈయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలిశారు రేవంత్ రెడ్డి. ఈయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విభజన హామీకి సంబంధించిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర పురోగతికి అవసరమైన విన్నపాల జాబితా పట్టుకుని రేవంత్, విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, పెండింగ్ నిధుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు రావాల్సి ఉంది. గత మూడేళ్లకు సంబంధించి 1,350 కోట్ల రూపాయల గ్రాంటు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని ప్రధాని మోదీని, సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.
అలాగే కృష్ణా జలాల పంపకాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా మొహించారు. ఏపీ పరిధిలో ఉన్న గేట్లకు కంచె ఏర్పాటు చేశారు. తమ నీళ్లను తాము వినియోగించుకుంటున్నామని చెప్పారు అక్కడి ఇరిగేషన్ అధికారులు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయేది తమ ప్రభుత్వం అని నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కూర్చొని చర్చించుకుంటామన్నారు.
దీనిపై వెంటనే కమిటీ వేసి నీటి పంపకాలు జరపాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటూ ఎన్నికలకు ముందు మోదీ తెలంగాణ వచ్చినప్పుడు గిరిజన వర్శిటీ, పసుపుబోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్‌గా గుర్తిస్తున్నామన్నారు. త్వరితగతిన వీటి ఏర్పాటుతో పాటు వివిధ పథకాల కింద తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై మోదీతో చర్చించారని సమాచారం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్న అంశాలన్నీ విన్న ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
After taking charge as the Chief Minister of Telangana, had a courtesy meeting today for the first time with the honourable Prime minister Shri @narendramodi ji.
We sought prompt resolution of the pending issues and cooperation for the development of the state from the PM.… pic.twitter.com/MAFOL57Re7
— Revanth Reddy (@revanth_anumula) December 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..