Telangana: గంజాయి అనుకుంటే పొరపాటే.! పోలీసుల రైడింగ్‌లో విస్తుపోయే నిజాలు..

తెలంగాణలో అల్ఫ్రాజొలమ్‌కు డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది.ఈ ఏడాది ఒక్క అల్ఫ్రాజొలమ్ విక్రయాలపై పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. అసలు ఏంటి ఈ అల్ఫ్రాజొలమ్?? వీటికి ఎందుకంత డిమాండ్ ?? మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?? ఇప్పుడు తెలుసుకుందామా..

Telangana: గంజాయి అనుకుంటే పొరపాటే.! పోలీసుల రైడింగ్‌లో విస్తుపోయే నిజాలు..
Hyderabad Police
Follow us
Vijay Saatha

| Edited By: Ravi Kiran

Updated on: Dec 26, 2023 | 3:39 PM

తెలంగాణలో అల్ఫ్రాజొలమ్‌కు డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది.ఈ ఏడాది ఒక్క అల్ఫ్రాజొలమ్ విక్రయాలపై పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. అసలు ఏంటి ఈ అల్ఫ్రాజొలమ్?? వీటికి ఎందుకంత డిమాండ్ ?? మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?? ఇప్పుడు తెలుసుకుందామా..

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అల్ఫ్రాజొలమ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి అల్ఫ్రాజొలమ్‌ను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే అల్ఫ్రాజొలమ్‌పై 66 కేసులు నమోదయ్యాయి. అటు DRI నుంచి మొదలుపెట్టి ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు, నార్కోటిక్ పోలీసుల దాకా అల్ఫ్రాజొలమ్ ముఠాలను పట్టుకున్నారు. ఒక్క DRI అధికారులు ఈ ఏడాదిలో 3.14 కోట్లు విలువ చేసే అల్ఫ్రాజొలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూలు వద్ద ఈ ఆపరేషన్‌ను DRI అధికారులు చేపట్టారు. మొత్తం 31.42 కేజీలు విలువ చేసే అల్ఫ్రాజొలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక జిన్నారం పోలీసులతో కలిసి నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో 14 కేజీల నోర్డాజిపాం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి తరలిస్తున్న మహమ్మద్ యూనస్ అలియాస్ జక్కా రాజుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఇక మరో కేసులో సూరారం వద్ద 10 కేజీల అల్ఫ్రాజొలమ్‌ను నరేందర్, సతీష్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వీరికి పరమేశ్వర కెమికల్స్ ఎండి కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ నుంచి అల్ఫ్రాజొలమ్ వచ్చినట్టు విచారణలో బయటపడింది. కిరణ్ కుమార్‌ను ప్రస్తుతం టిఎస్ న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐదు రోజుల పాటు ఒక కెమికల్ ఫ్యాక్టరీని రెంటుకు తీసుకొని అల్ఫ్రాజొలమ్‌ను తయారు చేశారు. ఒక్కో రోజు నాలుగు లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తూ అల్ఫ్రాజొలమ్‌ను తయారు చేసి అమ్ముకున్నారు.

అల్ఫ్రాజొలమ్ విక్రయాల్లో పలువురు ఎక్సైజ్ సిబ్బంది సైతం తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇందులో సస్పెండ్ అయిన ఒక కానిస్టేబుల్ నుంచి 8 కేజీల అల్ఫ్రాజొలమ్‌ను, స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో కేసులో ఢిల్లీ నుంచి వచ్చిన 34 కేజీల అల్ఫ్రాజొలమ్‌ను మూడు భాగాలుగా విభజించి విక్రయాలు జరిపారు. మొదటి ఏడు కేజీలను గచ్చిబౌలికి చెందిన నరసింహ గౌడ్ విక్రయించగా, మరో 10 కేజీలను ఎక్సైజ్ కామారెడ్డి కానిస్టేబుల్ రమేష్ విక్రయించాడు. వీరిలో గచ్చిబౌలికి చెందిన నరసింహ గౌడ్ కీలక సూత్రదారిగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి అల్ఫ్రాజొలమ్‌ను ఒక్క కేజీ అల్ఫ్రాజొలమ్‌ను 2.24 లక్షలకు విక్రయించి హైదరాబాద్‌లో వీటిని 3.45 లక్షలకు అమ్మేవాడు. అలా ఒక నెలలో 30 నుంచి 4 కేజీల అల్ఫ్రాజొలమ్‌ను అమ్మేవాడు. నరసింహ గౌడ్‌తో పాటు అతడి కుమారులు రాజశేఖర్ గౌడ్ సైతం ఈ దందాలో పాలుపంచుకున్నాడు. అల్ఫ్రాజొలమ్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులు గడుపుతున్నారు. ఢిల్లీ నుండి సరుకు హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మెట్రో కొరియర్ మార్గాలను ఎంచుకున్నాడు. వీటికి సంబంధించిన చెల్లింపులను మొత్తం హవాలా మార్గంలోనే చెల్లించేవాడు.

హైదరాబాద్‌లో వీటికి ఎక్కువగా డిమాండ్ రావటం వెనుక ఇలాంటి ముఠా హస్తమే ఉంది. స్థానిక యువతను మత్తు వైపు ఆకర్షించేందుకు అల్ఫ్రాజొలమ్ లాంటి పదార్థాలను పావులుగా మలుచుకుని ముఠాలు కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో నరసింహ గౌడ్ అనే వ్యక్తి తన ఆస్తులను సైతం పెంచుకున్నాడు. అతడిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!