AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Law Student: క్రిమినల్ చర్యలకు పాల్పడిన యువతి.. ఇట్టే పసిగట్టిన పోలీసులు.. అసలు విషయం ఇదే..

ఈ మధ్యకాలంలో ప్రేమించడం ప్రేమ విఫలం అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇక్కడ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంనేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేసింది రింకీ అనే యువతి. కానీ.. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ఆ యువతి ప్లాన్‌ మొత్తం పసిగట్టారు పోలీసులు. ఆమెతో సహా మొత్తం గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు.

Law Student: క్రిమినల్ చర్యలకు పాల్పడిన యువతి.. ఇట్టే పసిగట్టిన పోలీసులు.. అసలు విషయం ఇదే..
Ganja Case Arrest
Srikar T
|

Updated on: Dec 26, 2023 | 5:50 PM

Share

ఈ మధ్యకాలంలో ప్రేమించడం ప్రేమ విఫలం అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇక్కడ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంనేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేసింది రింకీ అనే యువతి. కానీ.. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ఆ యువతి ప్లాన్‌ మొత్తం పసిగట్టారు పోలీసులు. ఆమెతో సహా మొత్తం గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పరిధిలో జరిగింది.

హైదరాబాద్‌ రహమత్‌నగర్‌లో నివాసముంటున్న రింకీ.. అమీర్‌పేటలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తోంది. సరూర్‌నగర్‌కు చెందిన శ్రవణ్‌ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్‌.. రింకీని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ప్రియుడి మీద కోపం పెంచుకున్న యువతి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కోపం ఉంది కానీ ఆ కోపాన్ని తీర్చుకునే మార్గం ఆమెకు కనిపించలేదు. అవకాశం కోసం కొంత కాలం ఎదురుచూసింది. తానే కర్త, కర్మ, క్రియ అయ్యి.. ప్రియుడిని ఇరికించాలని నిర్ణయించుకుంది.

తన స్నేహితుల ద్వారా గంజాయి సేకరించింది. ఆ గంజాయిని మరో ఫ్రెండ్‌ సహాయంతో ప్రియుడి కారులో పెట్టేలా పధకం రచించింది. దీని కోసం అందరూ కలిసి పబ్ కి వెళ్లారు. అక్కడ తన మాజీ ప్రియుడి కార్లో గంజాయి ప్యాకెట్లు పెట్టాలని స్నేహితులకు చెప్పింది. తరువాత తానే పోలీసులకు ఫోన్‌ చేసి ఫలానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారులో గంజాయి సరఫరా జరుగుతోందిని సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ కారును ఆపి చెక్‌ చేయడంతో నిజంగానే కారులో 40 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆ అబ్బాయిని అరెస్ట్‌ చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు. తనకే పాపం తెలియదని ఆ అబ్బాయి ఎంత చెప్పినా వినలేదు. కానీ.. పోలీసుల విచారణలో అబ్బాయికి క్లీన్‌ రికార్డ్‌ వచ్చింది. గతంలో కేసులు గానీ, గంజాయి డీలర్స్‌తో కాంటాక్స్ట్‌ కానీ ఏవీ లేవని గుర్తించారు పోలీసులు. సాంకేతికంగా తన ఫోన్ నంబర్లు, వాట్సప్ డేటా మొత్తం పరిశీలించారు ఎక్కడా క్రిమినల్ లావాదేవీలు ట్రేజ్‌ కాలేదు. దీంతో ఆ అబ్బాయి చెప్పేది నిజమే అనుకుని.. అమ్మాయి యాంగిల్‌లో విచారణ చేయడం ప్రారంభించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అమ్మాయిని పిలిపించి ఆ కారులో గంజాయి ఉన్న విషయం నీకు ఎలా తెలుసంటూ విచారించారు. క్రాస్‌ క్వశ్చనింగ్‌ చేయడంతో అమ్మాయి దొరికిపోయింది. దీంతో అమ్మాయిని, ఆమెకు సహకరించి స్నేహితుల ముఠాను అరెస్ట్‌ చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. లవర్‌ మీద కోపంతో పగ తీర్చుకోవాలనుకుని తానే కేసులో అడ్డంగా ఇరుక్కుంది రింకీ. రింకీకి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..