Amit Shah Tour: తెలంగాణపై అమిత్ షా గురి.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బీజేపీ
లోక్ సభ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు మొదలు పెట్టింది అసెంబ్లీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకున్నా పార్లమెంట్‌లో మాత్రం మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రిపేర్ అవుతుంది బీజేపీ. గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలను రెట్టింపు చేసేందుకు జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడం ఎనిమిది సీట్లు బీజేపీ గెలవడంతో ఇక పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం.

లోక్ సభ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు మొదలు పెట్టింది అసెంబ్లీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకున్నా పార్లమెంట్‌లో మాత్రం మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రిపేర్ అవుతుంది బీజేపీ. గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలను రెట్టింపు చేసేందుకు జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడం ఎనిమిది సీట్లు బీజేపీ గెలవడంతో ఇక పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి మాత్రం పదికి పైగా స్థానాలపై గురిపెట్టింది.
ఉత్తర తెలంగాణాలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీజేపీ. సీట్ల ఎంపికతో పాటు మరో వైపు కేడర్‌కు మార్గ నిర్దేశం చేసేందుకు ఢిల్లీ పెద్దలు రంగం లోకి దిగుతున్నారు .కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వం లో డిసెంబర్ 28న హైద్రాబద్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ కు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర నాయకత్వం. కొంగర కలాన్‌లో జరిగే ఈ సమావేశంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనబోతున్నారు.
మూడోసారి కూడా కేంద్రంలో అధికారం లోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రతి సీటును కూడా సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ లో మంచి ఊపులో ఉంది కాబట్టి ఈసారి దక్షిణ తెలంగాణలో కూడా బోణి కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా సమావేశంలో ఎన్నకల్లో అనుసరించాల్సిన ప్లాన్‌పై కేడర్‌తో చర్చించబోతున్నారు. అటు పెద్ద సంఖ్యలోనే టికెట్ ఆశిస్తున్న వారు ఉండటంతో టిక్కెట్ల కేటాయింపు అంశం కూడా చర్చకు రావచ్చు అంటున్నారు రాష్ట్ర నాయకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
