Andhra Pradesh: ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి?
తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఏపీలోనూ పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే.. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే.. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇంఛార్జ్ మాణిక్కం..
కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. ప్రధానంగా వైయస్ షర్మిల ఎపిసోడ్‌కు సంబంధించి క్లారిటీ రానుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం సంగతి పక్కనబెడితే.. అసలు.. ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి?…
తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఏపీలోనూ పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే.. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే.. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలంతోపాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైనా అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అదేసమయంలో.. వైఎస్ షర్మిల ఎపిసోడ్‌పై క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై స్పందించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల చేరికపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని.. ఆమె చేరిక ఏపీ కాంగ్రెస్‌కు బూస్టప్ అవుతుందన్నారు గిడుగు రుద్రరాజు.
ఇదిలావుంటే.. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్ ఎంటన్నది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు. అయితే.. అంతకుముందు కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. కానీ.. సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకి వస్తోంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్‌పై.. ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చల్లో షర్మిల ఎపిసోడ్‌పై ఫోకస్ చేసే అవకాశం ఉంది. నిజానికి.. గతంలో కాంగ్రెస్‌తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి.. ఏఐసీసీలో కీలక పదవిని షర్మిల ఆశించినట్లు తెలిసింది. దానికి తగ్గట్లుగానే.. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది.
అందుకు.. షర్మిల కూడా ఇంటర్నల్‌గా కాంగ్రెస్ అధిష్టానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దాంతో.. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డెసిషన్‌కు హైకమాండ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ దిశగానే ఢిల్లీలో జరిగే నేటి ఏపీ కాంగ్రెస్ నేతల కీలక సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిప్తోంది. మొత్తంగా.. ఆంధ్రప్రదేశ్‌పై దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ఫోకస్ చేస్తోంది. తెలంగాణ గెలుపు జోష్‌తో ఏపీలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అటు.. షర్మిల రాజకీయం కూడా కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. ఏపీ పాలిటిక్స్‌పై ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?.. షర్మిల ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి