AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: రామ్ లల్లా ప్రతిష్ఠాపనని రాజకీయం చేస్తున్నారు.. మేము పాల్గొనమని స్పష్టం చేసిన సీతారాం ఏచూరి..

ఆహ్వానం అందిన వారు వెళ్లాలా వద్దా అనేది వారి ఇష్టం అని ఏచూరి అన్నారు. ఆత్మకు, భగవంతుడికి మధ్య ఉండే పవిత్ర సంబంధమే మతమని అన్నారు. అయితే తాము నృపేంద్ర మిశ్రాజీని చాలా గౌరవిస్తాము. వారు నిర్వహిస్తున్న ఫంక్షన్ రాష్ట్ర ప్రాయోజితమైనది. ప్రధాని మోడీ అక్కడే ఉంటారు. దీనిని రాజకీయంగా మలుస్తున్నారు.. కనుక మేము రామాలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు వెళ్ళమని స్పష్టం చేశారు. అయితే ఆహ్వానాలు అందుకున్నవారు నచ్చితే వెళ్ళవచ్చు అని చెప్పారు ఏచూరి. 

Ayodhya Ram Mandir: రామ్ లల్లా ప్రతిష్ఠాపనని రాజకీయం చేస్తున్నారు.. మేము పాల్గొనమని స్పష్టం చేసిన సీతారాం ఏచూరి..
Ayodhya Ram Mandir
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Dec 28, 2023 | 5:47 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కల తీరే సమయం ఆసన్నవుతోంది. అయోధ్యలో రామయ్య కొలువు దీరే ముహర్తం సమీపిస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. మరోవైపు రామాలయ ప్రతిష్టాపనకు రాజకీయ నేతలకు, ప్రముఖులకు, స్వాములకు ఆహ్వానాలను రామ ట్రస్ట్ బోర్డు పంపిస్తోంది. రామ్ లల్లా ఆలయ ప్రతిష్టాపనకు హాజరుకావడంపై వామపక్ష పార్టీల నేతలను ప్రశ్నించగా.. ప్రధాని మోడీ హాజరు కానున్నందున తాము ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని చెప్పారు. ఆహ్వానం విషయంపై సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ నృపేంద్ర మిశ్రాజీ మమ్మల్ని ఆహ్వానించారని చెప్పారు. అయితే రామాలయం ప్రారంభోత్సవానికి వస్తావా రావా అని అడగలేదు.. అయితే తాము ఈ ఉత్సవానికి వెళ్లమని చెప్పారు.

ఆహ్వానం అందిన వారు వెళ్లాలా వద్దా అనేది వారి ఇష్టం అని ఏచూరి అన్నారు. ఆత్మకు, భగవంతుడికి మధ్య ఉండే పవిత్ర సంబంధమే మతమని అన్నారు. అయితే తాము నృపేంద్ర మిశ్రాజీని చాలా గౌరవిస్తాము. వారు నిర్వహిస్తున్న ఫంక్షన్ రాష్ట్ర ప్రాయోజితమైనది. ప్రధాని మోడీ అక్కడే ఉంటారు. దీనిని రాజకీయంగా మలుస్తున్నారు.. కనుక మేము రామాలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు వెళ్ళమని స్పష్టం చేశారు. అయితే ఆహ్వానాలు అందుకున్నవారు నచ్చితే వెళ్ళవచ్చు అని చెప్పారు ఏచూరి.

రామ్ లల్లా దీక్షలో సీపీఎం పాల్గొనదు

అయోధ్యలోని రామమందిరం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమంలో తమ పార్టీ పాల్గొనబోదని బృందా కారత్‌ తెలిపారు. హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తాం.. అయితే కొందరు మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని బృందా కారత్ అన్నారు. రామాలయ ప్రారంభోత్సవం మతపరమైన కార్యక్రమం.. అయితే దీనిని రాజకీయం చేస్తున్నారు.. ఇది సరైనది కాదని చెప్పారు బృందా కారత్‌.

ఇవి కూడా చదవండి

వామపక్ష నేతల ఈ ప్రకటనకు సంబంధించి కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. అందరికీ ఆహ్వానాలు పంపామని, అయితే రాముడు తన దగ్గరకు పిలిపించుకున్న వారు మాత్రమే రామ్ లల్లా దగ్గరకు వస్తారని అన్నారు.

జనవరి 22న రామమందిరప్రారంభోత్సవం

జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ రామ్ లల్లా దీక్షా కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలని పంపించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్యలో ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం అయోధ్యలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..