TTD : టీటీడీ ఉద్యోగుల శుభవార్త, ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. 350 ఎకరాలు కొనుగోలు చేయాలని నిర్ణయం..
టీటీడీ ఉద్యోగుల శుభవార్త. ఇళ్ల స్థలాల పంపిణీకి టీటీడీ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 అంశాలపై చర్చించిన పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. అంతేకాదు లడ్డు పోటులో పని చేసే కార్మికులకు అదనంగా రూ 10 వేల వేతనం పెంపు...,కల్యాణకట్టలోని క్షురకులకు నెలకు రూ.20 వేల వేతనం చెల్లించాలని నిర్ణయించింది టీటీడీ బోర్డ్
టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3, 518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలను గురువారం ప్రదానం చేయనున్నారు. జనవరి మొదటి వారంలో 1500 మంది ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు ఇస్తారు. అలాగే 3,500 మంది విశ్రాంత ఉద్యోగుల కోసం రూ.85 కోట్లతో 350 ఎకరాలు కొనుగోలు చేయాలని బోర్డ్ నిర్ణయించింది. అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్ద జీయర్ చిన్న జీయర్ మఠాలకు రూ.60 లక్షలు, రూ.40 లక్షలు అదనంగా పెంచుతూ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. లడ్డు పోటులో పని చేసే కార్మికులకు అదనంగా రూ 10 వేల వేతనం పెంపు.. కల్యాణకట్టలోని క్షురకులకు నెలకు రూ.20 వేల వేతనం చెల్లించాలని నిర్ణయించింది టీటీడీ బోర్డ్
తిరుపతిలోని టీటీడీ సత్రాల స్థానాల్లో 418 కోట్ల వ్యయంతో అచ్యుతం, శ్రీ పదం అతిధి భవనాలు నిర్మాణానికి టెండర్ ఖరారుకు ఆమోదం తెలిపారు. అలిపిరి దగ్గర మౌలిక సదుపాయలు, పార్కింగ్ అభివృద్ది ,. వరాహ స్వామి గెస్ట్ హౌస్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు నాలుగులైన్లు రోడ్డు నిర్మాణం, చెర్లోపల్లి-శ్రీనివాస మంగాపురం మధ్య 4 లైన్ల బిటిరోడ్డు నిర్మాణానికి బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఝార్ఖాండ్ రాష్ట్రం దేవగర్ లో 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ బోర్డ్ నిర్ణయించింది. చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ. 2 కోట్లు నిధులు కేటాయించారు.
శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు రూ. 300 సుపథం దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. తిరుపతి అభివృద్ధి, పారిశుద్ధ్యం నిర్వహణకు శ్రీవారి నిధుల నుంచి ఒక శాతం కేటాయించాలని గతంలో టీటీడీ నిర్ణయించింది. ఈ విషయంలో కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా పీఠాధిపతుల సమావేశం నిర్వహించాలనే అంశంపై కూడా బోర్డు చర్చించింది.
గోవిందా నామకోటి పుస్తకాలను, 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను, స్థానిక ఆలయాల చిత్రాలతో కూడిన క్యాలెండరును ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..