Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్య ఆలయ నిర్మాణం కోసం భూమిని అడుగులతో కొలిచిన చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ గురించి తెలుసా..

సుమారు 32 సంవత్సరాల క్రితం విశ్వహిందూ పరిషత్ మాజీ చీఫ్ అశోక్ సింఘాల్ అయోధ్యలో రామ మందిరానికి డిజైన్ తీసుకుని రావాల్సిందిగా.. బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోమవార్‌ను సంప్రదించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ సమయంలో ఆలయ నిర్మాణం జరిగే భూమి గురించి తెలుసుకోవడానికి చంద్రకాంత్ అయోధ్యకు వెళ్ళినప్పుడు అతను ఒక సాధారణ భక్తుడిగా మాత్రమే అక్కడకు వెళ్ళారు.

Ayodhya: రామయ్య ఆలయ నిర్మాణం కోసం భూమిని అడుగులతో కొలిచిన చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ గురించి తెలుసా..
Ayodhya Ram Temple
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2023 | 11:41 AM

భారతదేశం మొత్తం దశాబ్దాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక సంఘటనకు సాక్ష్యమివ్వబోతోంది జనవరి 22, 2024. చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఈ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వివాదాస్పద భూమి కోసం పోరాటం జరిగింది. ఆలయ నిర్మాణం భారతదేశ చరిత్రలో అత్యంత చారిత్రాత్మక సంఘటనగా నిలవనుంది.

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు 8,000 మందితో పాటు వివిధ వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులు పాల్గొననున్నారు. అయితే కోట్లాది హిందువుల కలను నిజం చేస్తూ రూపొందిన రామాలయాన్ని సోంపురా కుటుంబీకులు రూపొందించారు. ప్రారంభోత్సవ వేడుకకు ఈ కుటుంబం కూడా హాజరుకానుంది. ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంతో సహా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేవాలయాలను సోంపురా ఫ్యామిలీ రూపొందించింది.

సోంపురా సలాత్ గుజరాత్‌లోని రాతి-కార్మికుల సంఘం. వీరు దక్షిణ రాజస్థాన్‌లో ముఖ్యంగా మేవార్‌లో స్థిరపడ్డారు. ‘సలాత్’ అనే పదం శిలావత్ నుండి వచ్చింది. ఇది ఆలయ వాస్తుశిల్పికి సంబంధించిన పురాతన పదం.

ఇవి కూడా చదవండి

ఈ సంఘం కళాత్మక, శిల్పాల తయారీని తన వృత్తిగా చేసుకుంది. ఈ సంఘం ఆశాపురామాతను తమ కుల  దేవతగా పూజిస్తుంది. కమ్యూనిటీ  ప్రధాన దేవత శివుడు. కళాత్మకమైన నిర్మాణాలు, శిల్పాలు అలాగే కళాత్మకమైన రాతి తయారీలో ఈ సంఘానికి చెందిన వ్యక్తులు నిపుణులుగా ఖ్యాతిగాంచారు.

రామ మందిరానికి ప్రధాన వాస్తుశిల్పి ఎవరంటే

చంద్రకాంత్ సోంపురా అయోధ్యలోని రామ మందిరానికి ప్రధాన వాస్తుశిల్పి. చంద్రకాంత్  తాత ప్రభాశంకర్ ఓఘద్‌భాయ్ నాగర్ శైలి దేవాలయాల రూపకర్తల్లో ఒకరుగా ప్రసిద్ధి. ఆధునిక సోమనాథ్ ఆలయాన్ని రూపొందించారు. ఈయన చేతుల మీదుగానే సోమనాథ్ ఆలయ నిర్మాణం జరుపుకుంది.

చంద్రకాంత్ ఫ్యామిలీ భారతదేశంలో 200కి పైగా నిర్మాణాలను రూపొందించింది. దేవాలయాల రూపకల్పనలో కళను ఇతని ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్లుతూ ఉంది. ప్రస్తుతం చంద్రకాంత్ సోంపురా ఫ్యామిలీలో 15వ తరం. సోంపురా ముంబైలోని స్వామినారాయణ ఆలయం, కోల్‌కతాలోని ప్రసిద్ధ బిర్లా ఆలయాన్ని కూడా రూపొందించారు.

సుమారు 32 సంవత్సరాల క్రితం విశ్వహిందూ పరిషత్ మాజీ చీఫ్ అశోక్ సింఘాల్ అయోధ్యలో రామ మందిరానికి డిజైన్ తీసుకుని రావాల్సిందిగా.. బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోమవార్‌ను సంప్రదించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ సమయంలో ఆలయ నిర్మాణం జరిగే భూమి గురించి తెలుసుకోవడానికి చంద్రకాంత్ అయోధ్యకు వెళ్ళినప్పుడు అతను ఒక సాధారణ భక్తుడిగా మాత్రమే అక్కడకు వెళ్ళారు. రామాలయ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అతను తన పాదాలతో భూమిని కొలవవలసి వచ్చింది.

130 దేవాలయాలను రూపొందించిన చంద్రకాంత్ సోంపురా

చంద్రకాంత్ సోంపురా రామాలయం కోసం ఒక గొప్ప డిజైన్ చేసి దానిని 1990ల ప్రారంభంలో అలహాబాద్ లో జరిగిన కుంభమేళా సందర్భంగా సాధువులకు చూపించారు. ఆ డిజైన్ సాధువులచే ఆమోదించబడింది. ఆ నిర్మాణపు ఒరిజినల్ డిజైన్ ను 2020 సంవత్సరంలో హిందూ గ్రంథాలైన వాస్తు శాస్త్రం, శిల్ప శాస్త్రాల ప్రకారం  కొన్ని మార్పులను చేసి.. కొత్త డిజైన్‌ను సిద్ధం చేశారు.

రామ మందిరాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు చంద్రకాంత్‌కు అతని ఇద్దరు కుమారులు ఆశిష్, నిఖిల్ సోంపురా సహకరించారు. రామాలయం కాకుండా గాంధీనగర్‌లోని స్వామి నారాయణ్ ఆలయం, పాలన్‌పూర్‌లోని అంబాజీ ఆలయంతో సహా చంద్రకాంత్ దాదాపు 130 ఆలయాలను రూపొందించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..