Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajrang Punia: రెజ్లర్‌ బజ్‌రంగ్ పునియా సంచలన నిర్ణయం.. పద్మశ్రీ అవార్డుని తిరిగి ప్రధానికి ఇవ్వనున్న ఒలంపిక్ మెడలిస్ట్

తాజాగా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తునట్టు బజరంగ్‌ పూనియా ప్రకటించారు. రెజ్లర్ల దుస్థితిపై ప్రధాని మోడీ కి బజరంగ్‌ లేఖ రాశారు. మళ్లీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతునట్టు తెలిపారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదని, ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు బజరంగ్‌ పూనియా. మహిళా రెజ్లర్లకు భద్రత లేనందున తనకు లభించిన పద్మశ్రీ అవార్డును ప్రధాని మోడీ కే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు

Bajrang Punia: రెజ్లర్‌ బజ్‌రంగ్ పునియా సంచలన నిర్ణయం.. పద్మశ్రీ అవార్డుని తిరిగి ప్రధానికి ఇవ్వనున్న ఒలంపిక్ మెడలిస్ట్
Bajrang Punia
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2023 | 9:53 AM

బ్రిజ్‌ భూషణ్‌ కుడి భుజం సంజయ్‌సింగ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా ఎన్నిక కావడాన్ని పహిల్వాన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కుస్తీకి సాక్షిమాలిక్‌ గుడ్‌బై చెప్పగా.. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తునట్టు ప్రకటించారు బజరంగ్‌ పూనియా. కేంద్రం తమకు ఇచ్చిన మాట తప్పిందని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌ ఎన్నికను నిరసిస్తూ పహిల్వాన్ల నిరసన కొనసాగుతోంది. గురువారం కుస్తీ పోటీలకు గుడ్‌బై చెబుతున్నట్టు లేడీ రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తునట్టు బజరంగ్‌ పూనియా ప్రకటించారు. రెజ్లర్ల దుస్థితిపై ప్రధాని మోడీ కి బజరంగ్‌ లేఖ రాశారు. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేశారని, ఈ విషయంపై ప్రధాని మోడీ కి అవగాహన ఉందన్నారు. ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించినట్టు చెప్పారు బజరంగ్‌ పూనియా.

ఇవి కూడా చదవండి

మళ్లీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతునట్టు తెలిపారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదని, ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు బజరంగ్‌ పూనియా. మహిళా రెజ్లర్లకు భద్రత లేనందున తనకు లభించిన పద్మశ్రీ అవార్డును ప్రధాని మోడీ కే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో మాకు గొడవ లేదు.. మా పోరాటం ప్రభుత్వంపై కాదు.. ఓ వ్యక్తిపై.. ఈ గొడవను ఆయన రాజకీయం చేశారు.. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే బజరంగ్‌ పూనియా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయడం ఆయన వ్యక్తిగత విషయమని కేంద్ర క్రీడల శాఖ స్పందించింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..