AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. ఆహారంపై చక్కర్లు కొడుతోన్న జలగ.. షాకింగ్ వీడియో వైరల్

ప్రస్తుతం దేశంలో అనేక రకాల ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇలా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ దాదాపు అరగంటలో మీ చెంతకు  చేరుతుంది. అయితే ఈ ఫుడ్ కంపెనీల నుండి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ చాలా సార్లు మోసపోతున్నారు. ఇలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.   

Viral Video: స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. ఆహారంపై చక్కర్లు కొడుతోన్న జలగ.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Dec 19, 2023 | 2:53 PM

Share

బిజిబిజీ లైఫ్ లో తినే ఆహారం నుంచి చేసే పని వరకూ అన్నింటిలోనూ సులభమైన పద్ధతిని ఎంచుకుంటారు. అందులో భాగంగా చాలా మంది ఆకలి వేసినప్పుడు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ కోసం పెట్టడానికి ఆసక్తిని చూపిస్తారు. అలా ఇంట్లో నుంచి అయినా ఆఫీసు నుంచి అయినా సరే ఫుడ్ ని ఆర్డర్ చేస్తారు. ఇలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఆహారాన్ని క్షణాల్లో డెలివరీ చేస్తారు. ఇలా మొబైల్ యాప్ ద్వారా తక్షణమే తమ ఆకలిని తీర్చే విధంగా కావాల్సిన ఆహారాన్ని పొందుతారు. దీంతో ప్రస్తుతం దేశంలో అనేక రకాల ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇలా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ దాదాపు అరగంటలో మీ చెంతకు  చేరుతుంది. అయితే ఈ ఫుడ్ కంపెనీల నుండి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ చాలా సార్లు మోసపోతున్నారు. ఇలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

బెంగళూరులో నివసిస్తున్న ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీ స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. సమయానికి ఆహారం అతని వద్దకు చేరింది. ఆకలి మీద ఉన్న అతను ఆ ఫుడ్ పేకెట్ ను తెరిచినప్పుడు.. లోపల జీవించి ఉన్న జలగను చూశాడు. అది చూసిన వెంటనే తన మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాసేపటికే వైరల్‌గా మారింది. ఈ వీడియోను ధవల్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Dhavalsingh7 IDతో షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్

ఆహారం మీద పాకుతున్న జలగ ఉన్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. వీడియోను షేర్ చేసిన వ్యక్తి ట్విట్టర్‌లో స్విగ్గీని ట్యాగ్ చేసి.. “తాను ఇక లియోన్స్ గ్రిల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయనని.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా చూసుకోవడానికి @SwiggyCares ఏమైనా చర్యలు చూస్తుందా అని కామెంట్ తో వీడియో షేర్ చేశాడు. కేవలం 9 సెకన్ల ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..