AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డు ప్రక్కన ఆపిన అమెజాన్ ట్రక్‌.. వస్తువులను దోచుకెళ్లిన యువకులు.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది అబ్బాయిలు అమెజాన్ ట్రక్ నుండి వస్తువులను దోచుకోవడం కనిపించింది. ఒక అమెజాన్ ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి ఉంచడం చూడవచ్చు. ఈ వాహనం నుంచి కొంత మంది అబ్బాయిలు త్వరగా వస్తువులను బయటకు తీస్తున్నారు. ట్రక్కులోపల వస్తువులను దోచుకుని పారిపోతున్నారు. ఇంతలో కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగి అక్కడికి చేరుకుంది..

Viral Video: రోడ్డు ప్రక్కన ఆపిన అమెజాన్ ట్రక్‌.. వస్తువులను దోచుకెళ్లిన యువకులు.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Dec 19, 2023 | 2:03 PM

Share

మారిన కాలంతో పాటు షాపింగ్ అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఇంట్లో ఉండే తమకు నచ్చిన మెచ్చిన వస్తువులను ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. ఇందులో కోసం అనేక చిన్న, పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆన్ లైన్ షాపింగ్ దుకాణాలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీటిలో అమెజాన్ కంపెనీ పేరు అగ్రస్థానంలో ఉంది. దీని యజమాని జెఫ్ బెజోస్.. అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఈ కంపెనీని నమ్మి ఆన్ లైన్ లో రకరాల వస్తువులను ఆర్డర్ చేసి కొనుగోలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ఆ వస్తువు కొన్ని రోజుల్లోనే మీ ఇంటికి చేరుతుంది. అయితే డెలివరీ కోసం వస్తువులతో వెళ్తున్న కంపెనీ ట్రక్కుని ఆపి వస్తువులను దోచుకుంటే ఏమి జరుగుతుందో ఊహించండి? అవును.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది అబ్బాయిలు అమెజాన్ ట్రక్ నుండి వస్తువులను దోచుకోవడం కనిపించింది. ఒక అమెజాన్ ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి ఉంచడం చూడవచ్చు. ఈ వాహనం నుంచి కొంత మంది అబ్బాయిలు త్వరగా వస్తువులను బయటకు తీస్తున్నారు. ట్రక్కులోపల వస్తువులను దోచుకుని పారిపోతున్నారు. ఇంతలో కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగి అక్కడికి చేరుకుంది.. అయితే యువకులు ఎక్కువమంది యువకులు ఉండడం చూసి.. ఆ ఉద్యోగిని కొంచెం భయపడింది. ట్రక్కుకు కొంత దూరంలో నిలబడి పోయింది. ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్న వ్యక్తి ఈ మొత్తం దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 19 సెకన్ల ఈ వీడియో ఇప్పటి వరకు 1.7 మిలియన్లు అంటే 17 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకోగా.. 8 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు.

‘ఇప్పుడు మీ ప్రాంతంలో సరుకులు డెలివరీ కాకపోతే ఫిర్యాదు చేయవద్దు’ అని ఒకరు కామెంట్ చేయగా, మరో వినియోగదారు ‘ట్రక్కును రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఎక్కడికీ వెళ్లవద్దు.. అది కూడా లాక్ చేయకుండా. లేదంటే ఇలా జరగవచ్చు అని వ్యాఖ్యానించారు. ‘అమెజాన్ ఈ ప్రాంతంలో తన డెలివరీ సేవలను నిలిపివేయాలి’ అని కూడా కొంతమంది చెబుతున్నారు.

మరిన్ని ట్రెడింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..