Clean Ganga Mission: మిషన్ గంగా కోసం ఏకమైన ప్రపంచంలోని 11 దేశాలు.. ఈ ప్రణాళిక ఎలా పనిచేస్తుందంటే

గ్లోబల్ రివర్ సిటీస్ అనేది 2021లో భారతదేశంలో ప్రారంభించబడిన రివర్ సిటీస్ అలయన్స్ (RCA) గ్లోబల్ వెర్షన్. ఇది భారతదేశంలోని నదీ నగరాలకు పట్టణ నదుల స్థిరమైన నిర్వహణ కోసం సమాచారాన్ని పొందుపరుస్తుంది.. అంతేకాదు నదుల సంరక్షణ కోసం ఆలోచన చేయడానికి, చర్చించడానికి.. ఆలోచన మార్పిడి చేయడానికి ఒక ప్రత్యేక వేదిక. ఇది నదులు, నగరాలను అనుసంధానించడానికి పని చేస్తుంది. ఇది నగరాలు ఒకరి విజయాలను,  వైఫల్యాల నుండి మరొకరు నేర్చుకునేలా చేస్తుంది.. అంతేకాదు ప్రజలను నదులతో అనుసంధానిస్తుంది. 

Clean Ganga Mission: మిషన్ గంగా కోసం ఏకమైన ప్రపంచంలోని 11 దేశాలు.. ఈ ప్రణాళిక ఎలా పనిచేస్తుందంటే
Clean Ganga Mission
Follow us

|

Updated on: Dec 16, 2023 | 3:25 PM

గత కొన్ని రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన COP-28లో వాతావరణ మార్పులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఇదిలా ఉండగా COP-28లో భారతదేశం నదులకు సంబంధించిన ప్రపంచ సంస్థను ప్రారంభించింది. దీనికి గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) అని పేరు పెట్టారు. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది నదులను సంరక్షించడానికి ప్రపంచవ్యాప్త దేశాలు చొరవ చూపిస్తాయి. ఈ సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) నేతృత్వంలో పని చేస్తూ ఉంటుంది.  NMCG భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ క్రింద వస్తుంది.

భారతదేశం నాయకత్వంలో ఏర్పాటైన ఈ సంస్థ ఎందుకు ప్రత్యేకమైనదో.. దీనితో ఏయే దేశాలకు అనుబంధం ఉందో తెలుసుకుందాం.

GRCA ఏ పని చేస్తుందంటే?

ప్రపంచంలోనే నదుల సంరక్షణకు ఏర్పడిన మొదటి కూటమి గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ . దీని ప్రధాన లక్ష్యం నదుల సంరక్షణ, స్థిరమైన నీటి నిర్వహణ. సాంకేతిక సహాయాన్ని ఒక దేశంతో మరొక దేశం పంచుకోవడం. పట్టణ నదుల పరిస్థితిని మెరుగుపరచడానికి సంబంధించిన అంశాలు, సామర్థ్యం పెంపుదలపై భాగస్వామ్య దేశాలు నిర్దిష్ట చర్చలను నిర్వహించగల ప్రపంచ వేదిక GRCA సంస్థ.

ఇవి కూడా చదవండి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA), నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ సెక్రటేరియట్‌గా పనిచేస్తాయి. ఈ గ్లోబల్ అలయన్స్‌లో ప్రపంచంలోని వివిధ మూలల నుండి 11 దేశాలు ఉన్నాయి. 275 కంటే ఎక్కువ నదీ పరివాహక నగరాలు ఇందులో ఉంటాయి. ఇందులో భారత దేశంతో పాటు ఈజిప్ట్, డెన్మార్క్, ఘన, భూటాన్, కంబోడియా, జపాన్ దేశాలతో పాటు నెదర్లాండ్స్ నుండి హేగ్ (డెన్ హాగ్), ఆస్ట్రేలియా నుండి అడిలైడ్, హంగరీ నుండి స్జోల్నోక్ అనే నదీతీర నగరాలు కూడా ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) వంటి నిధుల ఏజెన్సీలు ఈ కూటమికి తమ మద్దతునిచ్చాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన COP-28లో, భారతదేశం గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) పేరుతో నదులకు సంబంధించిన ప్రపంచ సంస్థను ప్రారంభించింది.

గ్లోబల్ రివర్ సిటీస్ అనేది 2021లో భారతదేశంలో ప్రారంభించబడిన రివర్ సిటీస్ అలయన్స్ (RCA) గ్లోబల్ వెర్షన్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ , నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా సంయుక్తంగా రివర్ సిటీస్ అలయన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలోని నదీ నగరాలకు పట్టణ నదుల స్థిరమైన నిర్వహణ కోసం సమాచారాన్ని పొందుపరుస్తుంది.. అంతేకాదు నదుల సంరక్షణ కోసం ఆలోచన చేయడానికి, చర్చించడానికి.. ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి ఒక ప్రత్యేక వేదిక. ఇది నదులు, నగరాలను అనుసంధానించడానికి పని చేస్తుంది. ఇది నగరాలు విజయాలను,  వైఫల్యాలను ఒక నగరం నుంచి మరొక నగరం నేర్చుకునేలా చేస్తుంది. అంతేకాదు ప్రజలను నదులతో అనుసంధానిస్తుంది.

ప్రారంభంలో రివర్ సిటీస్ అలయన్స్‌లో గంగా బేసిన్‌లోని 30 సభ్య నగరాలు మాత్రమే ఉన్నాయి. తరువాత  గంగా పరీవాహక ప్రాంతం వెలుపల ఉన్న నగరాలను చేర్చడంతో దీని పరిధి విస్తరించబడింది. ఈ కూటమి నెట్‌వర్కింగ్, కెపాసిటీ బిల్డింగ్ , టెక్నికల్ అసిస్టెన్స్ అనే మూడు అంశాలపై దృష్టి పెడుతుంది.

ఇటీవల నదీ నగరాల కూటమి తరపున నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా.. US మిస్సిస్సిప్పి రివర్ సిటీస్ అండ్ టౌన్స్ ఇనిషియేటివ్ (MRCTI)తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చొరవ అమెరికాలోని మిస్సిస్సిప్పి నది వెంబడి ఉన్న 124 నగరాలు, పట్టణాలను సూచిస్తుంది. COP-28లోనే ఈ ఇద్దరి మధ్య మెమోరాండం ఆఫ్ కామన్ పర్పస్ (MoCP) సంతకంచేశారు. ఈ ముఖ్యమైన ఒప్పందంతో రివర్ సిటీస్ అలయన్స్ బలం 267 నదీ నగరాలకు విస్తరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..