AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament: పార్లమెంట్ దాడికి వెనుక అసలు కారణమిదే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ భద్రత లోపంపై, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. పార్లమెంటు దాడి వెనుక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణమని రాహుల్ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంటుకు గట్టి భద్రతా ఉంది, అయితే ఇది ఎందుకు జరిగింది? అని రాహుల్ ప్రశ్నించారు.

Parliament: పార్లమెంట్ దాడికి వెనుక అసలు కారణమిదే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Dec 16, 2023 | 3:47 PM

Share

పార్లమెంట్ భద్రత లోపంపై, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. పార్లమెంటు దాడి వెనుక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణమని రాహుల్ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంటుకు గట్టి భద్రతా ఉంది, అయితే ఇది ఎందుకు జరిగింది? అని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య, దీనికి సంబంధించి దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల వల్ల భారతదేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానాల వల్ల పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ ధ్వజమెత్తారు. భారదేశ జనాభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.

2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 13) భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. లోక్‌సభలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభ లోపలికి దూకారు. అనంతరం షూస్‌లో పెట్టుకుని వచ్చిన డబ్బా ద్వారా పసుపు పొగ వదిలి హాల్ మొత్తం వ్యాపించేలా చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది.

లోక్‌సభకు జంప్ చేసిన ఇద్దరు వ్యక్తులను సాగర్ శర్మ, మనోరంజన్ డిగా గుర్తించారు. సభ వెలుపల ఉన్న ఇద్దరు వ్యక్తులను హర్యానాలోని జింద్ జిల్లాలోని ఘసో ఖుర్ద్ గ్రామానికి చెందిన నీలమ్, మహారాష్ట్రలోని లాతూర్‌ నివాసి అమోల్ షిండేగా గుర్తించారు. దీంతో పాటు వీటన్నింటికీ సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అలాగే పార్లమెంట్‌లోకి చొరబడిన ఇద్దరు సహా మొత్తం నిందితులను గురువారం 7 రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిలో ఇద్దరికి విజిటర్స్ పాస్‌లు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతిప్ సింహా పేరు మీద జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇదిలావుంటే పార్లమెంట్ భద్రతకు భంగం వాటిల్లిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే పార్లమెంటు సమావేశాలు రోజంతా కొనసాగలేదు. సభలో హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విచారణకు ఆదేశాలు ఇచ్చామని, అందుకే ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…