Bihar: ఓ డాక్టర్ చేసిన చేతకాని పనికి.. వారి జీవితం తలకిందులైంది. రూ. 6,000 పరిహారం.
బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఓ మహిళ రెండుసార్లు గర్భం దాల్చింది. ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది. 2015లో ఆమె స్టెరిలైజేషన్ సర్జరీ చేయించుకుంది. మరోసారి ఆమె గర్భం దాల్చినట్టు ఇటీవలే నిర్ధారణ అయ్యింది. 2015లో గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నానని, అయినప్పటికీ మరోసారి తల్లి కాబోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఓ మహిళ రెండుసార్లు గర్భం దాల్చింది. ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది. 2015లో ఆమె స్టెరిలైజేషన్ సర్జరీ చేయించుకుంది. మరోసారి ఆమె గర్భం దాల్చినట్టు ఇటీవలే నిర్ధారణ అయ్యింది. 2015లో గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నానని, అయినప్పటికీ మరోసారి తల్లి కాబోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ముజఫర్‌పూర్‌లో ఒక మహిళ 2015లో స్టెరిలైజేషన్ సర్జరీ చేయించుకున్నప్పటికీ తాను రెండుసార్లు గర్భం దాల్చానని చెప్పింది. తాను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇటీవలే గుర్తించింది.
అప్పటికే ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా 2015లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నానని మహిళ తెలిపింది. ఆపరేషన్ తర్వాత కూడా రెండుసార్లు గర్భం రావడంతో మొత్తం ఆరుగురికి తల్లిని కాబోతున్నట్టు పేర్కొంది. మహిళ భర్త హర్యానాలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా ఆపరేషన్ తర్వాత కూడా మహిళ గర్భం దాల్చడంపై 2018లో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. ఆపరేషన్ విఫలమైనందుకుగానూ ఆరోగ్య కేంద్రంలో నాటి సివిల్ సర్జన్ రూ.6,000 మొత్తాన్ని బాధిత దంపతులకు పరిహారంగా అందించి చేతులు దులుపుకున్నాడు. దీన్ని దంపతులు తీవ్రంగా నిరసించారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని సందర్శిస్తున్నప్పటికీ వైద్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని దంపతులు చెబుతున్నారు. కాగా ఈ విషయంలో విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్యకేంద్రం ఇన్‌ఛార్జ్ సివిల్ సర్జన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

