నదిలో బైక్ రైడ్ చేస్తూ వెళ్లిన వ్యక్తి !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో మన కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు రకరకాల వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. వాటిలో కొన్ని నిజంగా చేసినా నమ్మశక్యంకాని వీడియోలు ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నది కనిపిస్తోంది. సాధారణంగా నదిని బోటులో కానీ, పంటిపైన గానీ దాటుతారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో మన కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు రకరకాల వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. వాటిలో కొన్ని నిజంగా చేసినా నమ్మశక్యంకాని వీడియోలు ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నది కనిపిస్తోంది. సాధారణంగా నదిని బోటులో కానీ, పంటిపైన గానీ దాటుతారు. కానీ ఇక్కడ ఓ యువకుడు బైక్‌పైన నదిని దాటి వెళ్లాడు. అవును, అతను రోడ్డుమీద వెళ్లినంత ఈజీగా నదిలో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్లాడు. నడుము లోతు నీటిలో బైక్‌పైన బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడమంటే మామూలు విషయం కాదు. ఆ వ్యక్తి నదిలో బైక్‌పై వెళ్తుంటే ఒడ్డున ఉన్న వారు ఆశ్చర్యంతో కేకలు వేశారు. అయితే, ఆ నదిలో కుంగిపోయిన రాతి బ్రిడ్జిపై ఆ వ్యక్తి బైక్ నడిపినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 94 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాదిమది లైక్ చేశారు. ఎంతో మంది వీడియోలోని వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. ఇదెలా సాధ్యం.. ఏమైనా ఆ వ్యక్తి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని