Gayatri Mantra: చేతులు, కాళ్లతో గాయత్రీ మంత్రాన్ని రాసిన 3315 మంది దివ్యాంగ చిన్నారులు.. సీఎం ప్రశంల వర్షం..

తాము చేపట్టిన పనిని విజయవంతం చేయాలనే సంకల్పంతో కృషి పట్టుదలతో పని చేస్తే.. సాధించలేనిది ఏముంది అని నిరూపించారు కొంతమంది దివ్యాంగ చిన్నారులు. తమకు దేవుడిచ్చిన అవయవ లోపాన్ని అధిగమించి గాయత్రీ మంత్రాన్ని చేతులతో, కాళ్లతో రాసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు కొంతమంది చిన్నారులు. త్రివిధ సాధనతో ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ సారధ్యంలో చరిత్ర సృష్టించారు దివ్యాంగులు. ఈ కార్యక్రమంలో సుమారు 3315 మంది వికలాంగ పిల్లలు ఉత్సాహంతో పాల్గొని.. తమ చేతులు, కాళ్లతో గాయత్రీ మంత్రాన్ని రాశారు. 

Surya Kala

|

Updated on: Dec 18, 2023 | 5:59 PM

ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ .. ఈ సంస్థ సృజనాత్మకత, సంస్కరణ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఈ క్రమంలో ఈ గాయత్రి ఫ్యామిలీ ఒడిలోకి మరో ఘనత చేరింది. గాయత్రీ ట్రిపుల్ సాధనలో భాగంగా పండిత శ్రీ రామ్ శర్మ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుండగా..గాయత్రి మంత్ర రచన, బ్రెయిలీ లిపి, సంకేత భాషతో చిన్నారులు గాయత్రీ మంత్రాన్ని రాసి.. ప్రపంచ రికార్డుని సృష్టించారు.

1 / 6
ప్రపంచ వికలాంగుల వారోత్సవం కింద నిర్వహించిన ప్రచారంలో భాగంగా గుజరాత్ ప్రావిన్స్‌లోని 32 వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న 3315 మంది దివ్యాంగ పిల్లలు ఒకేసారి గాయత్రీ మంత్ర సాధనను చేశారు. సూరత్, అహ్మదాబాద్, భావ్‌నగర్, నవ్‌సారి, బల్సాద్, సురేంద్రనగర్, వడోదర, మొదాసా, అమ్రేలి, గోద్రా, పటాన్ తదితర ప్రాంతాల్లో చదువుతున్న వికలాంగ పిల్లలందరూ కలిసి గాయత్రీ మంత్రాన్ని రాశారు.

2 / 6
3315 మంది వికలాంగ పిల్లలు తమ చేతులు, కాళ్ళను ఉపయోగించి గాయత్రీ మంత్రాన్ని వ్రాసారు.  ఈ కార్యక్రమంలో చేతులు కాళ్ళు లేనివారు మాత్రమే కాదు దృష్టి లోపం ఉన్నవారు కూడా పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. గాయత్రీ తీర్థ శాంతికుంజ్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ కల్చర్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

3 / 6
తాము చేపట్టిన కార్యక్రమం సక్సెస్ అవ్వడంతో ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ అధినేత డా. ప్రణబ్ పాండ్యా ఈ ప్రచారంలో నిమగ్నమై కష్టపడి పనిచేసిన కుటుంబ సభ్యులందరికీ తమ శుభాకాంక్షలు తెలియజేసారు. 

4 / 6
వేదమూర్తి తపోనిష్ఠ, గాయత్రీ మంత్రాన్ని తమ సంస్థ సమాజానికి వ్యాపింపజేసిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాయత్రీ మంత్ర పఠనం చేయడానికి ప్రేరణ పొందారని వెల్లడించారు. గాయత్రీ మంత్రం మేధస్సును మంచి మార్గం వైపు నడిచేలా ప్రేరేపించే గొప్ప మంత్రమని అన్ని వేదాలలో గాయత్రీ మహా మంత్రం కీర్తించబడిందని వెల్లడించారు. 

5 / 6
ఈ ఘనత సాధించిన ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్‌ను  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఆల్  అభినందించారు. దివ్యాంగ పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు ఒక సువర్ణావకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ప్రచారంలో గుజరాత్‌కు చెందిన హేమాంగినీ బెన్ దేశాయ్, ప్రహర్స బెన్ మెహతా, శాంతికుంజ్‌కి చెందిన కీర్తన్ భాయ్ దేశాయ్ తదితరులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు.

6 / 6
Follow us