Divorce: డైవర్స్ ఇచ్చేందుకు ఓకే అన్న భార్య.. భరణం వద్దు.. కానీ షరతులు వర్తిస్తాయట..

మహారాష్ట్రలోని పూణెలోని ఫ్యామిలీ కోర్టులో విచిత్రమైన విడాకుల కేసు వెలుగు చూసింది. నగరంలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ విచారణ సమయంలో భర్త తనకు ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇస్తేనే తన భర్తకు విడాకులు ఇస్తానని భార్య చెప్పింది. తనకు రామ చిలుక తిరిగి ఇవ్వాలని భార్య పట్టుబట్టడంతో విడాకుల ప్రక్రియకు తాత్కాలికంగా వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే..

Divorce: డైవర్స్ ఇచ్చేందుకు ఓకే అన్న భార్య.. భరణం వద్దు.. కానీ షరతులు వర్తిస్తాయట..
African Gray Parrot
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2023 | 2:34 PM

మారుతున్న కాలంతో పాటు మనిషి బంధాలు అనుబంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో జీవిస్తామని ప్రమాణం చేసిన భార్యాభర్తలు కూడా విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ఇలాంటి  విడాకుల ప్రక్రియ ఆలస్యం కావడానికి ఎక్కువగా పిల్లలు రీజన్ అయితే.. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కోర్టులో దంపతులకు విడాకులు మంజూరు చేయడంలో జాప్యానికి కారణం ఒక రామ చిలుక. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని పూణెలోని ఫ్యామిలీ కోర్టులో విచిత్రమైన విడాకుల కేసు వెలుగు చూసింది. నగరంలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ విచారణ సమయంలో భర్త తనకు ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇస్తేనే తన భర్తకు విడాకులు ఇస్తానని భార్య చెప్పింది.  విడాకుల విషయంలో పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కారు. అయితే భర్త తమ వివాహానికి ముందు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్ రామ చిలుకను తిరిగి ఇవ్వమని కోరిందని. దీంతో ఈ విడాకుల కేసు అసాధారణ మలుపు తిరిగింది.

ఈ కేసులో భర్త తరఫున వాదిస్తున్న న్యాయవాది భాగ్యశ్రీ సుభాష్ గుజార్ మాట్లాడుతూ “తన క్లయింట్ పెళ్లికి ముందు తన భార్యకు ఆఫ్రికన్ గ్రే చిలుకను బహుమతిగా ఇచ్చాడు. పెళ్లి జరిగిన తర్వాత కాలం గడుస్తున్నప్పటికీ దంపతుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఈ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 11, 2019న పూణేలో వివాహం చేసుకున్న ఈ జంట.. సెప్టెంబరు 2021కి ఓ రేంజ్ లో విభేదాలు వచ్చాయి. దీంతో విడాకుల కేసు పూణె ఫ్యామిలీ కోర్టుకు చేరింది. భార్య డిసెంబర్ 2022లో విడాకుల ప్రక్రియను ప్రారంభించి.. రెండేళ్ల వివాహానికి ముగింపు పలికింది. అయితే కౌన్సెలింగ్ సెషన్‌ల సమయంలో ప్లాట్ ఇద్దరి మధ్య మళ్ళీ విబేదానికి కారణం అయింది.

ఇవి కూడా చదవండి

భార్యాభర్తల మధ్య “సయోధ్య జరగదని గ్రహించిన తర్వాత.. విడాకుల నిర్ణయం సామరస్యపూర్వకంగా జరగాలని కోరుకున్నారు. భార్య భరణం కోరలేదు. అయితే ఆశ్చర్యకరమైన డిమాండ్ తెరమీదకు తీసుకుని వచ్చింది. పెళ్లికి ముందు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్ బూడిద రంగు చిలుకను తిరిగి ఇవ్వాలని భార్య  కోరుకుంది.

తనకు రామ చిలుక తిరిగి ఇవ్వాలని భార్య పట్టుబట్టడంతో విడాకుల ప్రక్రియకు తాత్కాలికంగా వాయిదా పడింది. మొదట్లో ప్రతి ఘటించిన భార్య తదుపరి కౌన్సెలింగ్ సెషన్‌ల తర్వాత పక్షిని ఇచ్చే కండిషన్ ని విడిచిపెట్టింది. దీంతో ఇప్పుడు ఈ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేశారని,” అని గుజార్ చెప్పారు. ఈ విలక్షణమైన విడాకుల కేసుకు ముగింపు పలికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..