Congress: లోక్ సభలో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్.. ఇండియా కూటమి ధర్నా ఎందుకో తెలుసా..
పార్లమెంట్లో జరిగిన స్మోకింగ్ ఘటన యావత్ దేశాన్నే మేల్కొనేలా చేసింది. దీనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దుండగులు పార్లమెంట్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించారు.? ఈ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది.? అనే పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తున్నారు. ఈ స్మోక్ ఘటనపై విస్తృతంగా చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.

పార్లమెంట్లో జరిగిన స్మోకింగ్ ఘటన యావత్ దేశాన్నే మేల్కొనేలా చేసింది. దీనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దుండగులు పార్లమెంట్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించారు.? ఈ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది.? అనే పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తున్నారు. ఈ స్మోక్ ఘటనపై విస్తృతంగా చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఇప్పటికే పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఉభయసభల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, చర్చ జరగాలని డిమాండ్ చేశారు లోక్ సభలోని కొందరు సభ్యులు. దీంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. అటు లోక్ సభ, రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కల్గిస్తున్నారని ప్రశ్నించిన ఎంపీలపై సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో సుమారు 146 మంది ఎంపీలు ఉండటం గమనార్హం. ఇలా ప్రజాప్రతినిధుల గళం వినిపించిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షం ఆందోళనలు చేపట్టింది. వరుస సస్పెన్షన్లపై ఇండియా కూటమి శుక్రవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
సేవ్ డెమోక్రసీ పేరుతో ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీతో పాటూ ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించి.. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడమే సరైన పరిష్కారం అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








