Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid -19: మరోసారి విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 640 కొత్త కేసులు, కేరళలో ఒకరు మృతి

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ తాలూకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం, మరణాలు నమోదవ్వడం.. మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది. జెఎన్1 పేరుతో పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తొలి కేసు కేరళలో బైటపడింది. దీంతో బీ అలర్ట్ అంటున్నాయి అన్ని రాష్ట్రాలు.

Covid -19: మరోసారి విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 640 కొత్త కేసులు, కేరళలో ఒకరు మృతి
Covid 19 Cases
Follow us
Balaraju Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 22, 2023 | 2:43 PM

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ తాలూకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం, మరణాలు నమోదవ్వడం.. మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది. జెఎన్1 పేరుతో పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తొలి కేసు కేరళలో బైటపడింది. దీంతో బీ అలర్ట్ అంటున్నాయి అన్ని రాష్ట్రాలు.

అయితే తాజాగా కేరళలో కరోనా వైరస్ JN.1 ఇన్‌ఫెక్షన్ కొత్త రూపాంతరం నిర్ధారణ అయ్యింది. కేరళలో పరిస్థితి తీవ్రంగా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క కేరళలో మాత్రమే 265 కొత్త కరోనా కేసు నమోదయ్యాయి. అంతేకాకుండా, కేరళలో కొత్త వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడు. దీంతో దేశంలో ప్రస్తుతం 2,997 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపడం మొదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నియంత్రణ చర్యల్లో బిజీ అయ్యాయి. కేరళ. కర్నాటక రాష్ట్రాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఆసుపత్రులు లేదా రద్దీగా ఉండే ప్రదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత శానిటైజర్‌ను ఉపయోగించాలని సూచించారు. రెండు రోజుల క్రితం కేరళకు ఆనుకుని ఉన్న కర్ణాటకలో ఒకరు మరణించిన తరువాత, ఇన్ఫెక్షన్ గురించి ఆందోళన మొదలైంది. కేరళలో పెరుగుతున్న కేసుల కారణంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, గోవాలలో ప్రత్యేక నిఘా ఉంచారు.

ఇన్ఫెక్షన్ విషయంలో కేరళలో అత్యధిక ఆందోళనకరంగా ఉంది. రెండు రోజుల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలతో, మూడు సంవత్సరాల క్రితం సంక్రమణ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య 72,600 కు చేరుకుంది. ఇటీవల, కేరళలో కరోనా వైరస్ కొత్త ఉప-వేరియంట్, JN.1 తొలి కేసు గుర్తించడం జరిగింది. దీంతో పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, గోవాలలో కూడా నిఘా ఉంచారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఇక దేశంలో ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య 4.44 కోట్లకు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ నుండి జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, ప్రస్తుతం మరణాల రేటు 1.18 శాతం మాత్రమే. ఈ మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 లక్షల 33 వేల 328 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,997 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 220 కోట్ల 67 లక్షల 79 వేల 81 డోస్‌ల యాంటీ కరోనా వ్యాక్సిన్‌ను అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…