Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabarimala: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. భారీగా వర్చువల్‌ క్యూ బుకింగ్స్‌.. రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు

శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పను దర్శించుకుని ఇరుముళ్లను సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రద్దీని అదుపు చేయడంలో భాగంగా పోలీసులు ఎరుమేలి నుంచి వాహనాల ప్రవేశాన్ని నియంత్రించారు. శుక్రవారం నుండి డిసెంబర్ 25 వరకు వర్చువల్ క్యూ బుకింగ్‌లు పెరిగాయి. అన్ని రోజులలో 80,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి అయ్యప్ప కొండపై రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

Shabarimala: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. భారీగా వర్చువల్‌ క్యూ బుకింగ్స్‌.. రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు
Shabarimal Rush
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 22, 2023 | 12:28 PM

శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పను దర్శించుకుని ఇరుముళ్లను సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రద్దీని అదుపు చేయడంలో భాగంగా పోలీసులు ఎరుమేలి నుంచి వాహనాల ప్రవేశాన్ని నియంత్రించారు. శుక్రవారం నుండి డిసెంబర్ 25 వరకు వర్చువల్ క్యూ బుకింగ్‌లు పెరిగాయి. అన్ని రోజులలో 80,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి అయ్యప్ప కొండపై రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మండల పూజలో భాగంగా నిర్వహించే కీలకమైన తంకా అంకి ఆచారం 26న జరుగుతుండగా, మరుసటి రోజు మండల పూజ జరుగుతుంది. ఈ రెండు రోజుల బుకింగ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులతో శబరి గిరులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే అయ్యప్పను దర్శించుకునే వారితో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 16 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు అంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మార్గమాధ్యలోనే వాహనాలను పోలీసులు గంటల తరబడి నిలిపివేస్తున్నారు. మరోవైపు భారీ క్యూలైన్ల కారణంగా వృద్దులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు తెలిపారు.

ఇక క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అస్తవ్యస్తంగా మారడంతో డిసెంబర్ 7 నుండి వారం రోజుల పాటు ఇలాంటి పొడవైన క్యూలు కనిపించాయి. కేరళ పోలీసులు, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పరస్పరం నిందలు వేసుకున్నాయి. హైకోర్టు జోక్యంతో తొందరగా చర్యలు చేపట్టి, డిసెంబర్ 12 నాటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం రద్దీకి తగ్గట్టుగా అటు పోలీసులు, ఇటు ట్రావెన్‌ కోర్ ఏర్పాట్లు చేశాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..