Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. వరుస సెలవులతో సామూహిక గర్భాలయ అభిషేకాల నిలుపుదల

శ్రీశైలం ఆలయంలో రేపటి నుండి 25వ తేదీ వరకు గర్భాలయం, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 23న వైకుంఠ ఏకాదశి, 24న ఆదివారం, 25 సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలిగించేలా మూడు రోజుల పాటు గర్భాలయం, సామూహిక అభిషేకం నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. 

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. వరుస సెలవులతో సామూహిక గర్భాలయ అభిషేకాల నిలుపుదల
Srisailam Devotees Rush
Follow us

| Edited By: Surya Kala

Updated on: Dec 22, 2023 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో కొలువైన మల్లన్న భ్రమరాంబ లను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తుతారు. అయితే క్రిస్మస్ సందర్భంగా స్కూల్స్, ఉద్యోగస్తులకు వరుసగా సెలవులు రావడంతో సామూహిక, గర్భాలయం అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో రేపటి నుండి 25వ తేదీ వరకు గర్భాలయం, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 23న వైకుంఠ ఏకాదశి, 24న ఆదివారం, 25 సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలిగించేలా మూడు రోజుల పాటు గర్భాలయం, సామూహిక అభిషేకం నిలుపుదల చేశారు ఆలయ అధికారులు.

ఇవి కూడా చదవండి

ఈ మూడు రోజుల పాటు రోజుకు నాలుగు విడుతలుగా మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నామని చెప్పారు. దీంతో గర్భాలయ, సామూహిక ఆర్జిత అభిషేకాల తో పాటు శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి అభిషేకం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలియజేసారు. ఆ మూడు రోజుల్లో నాలుగు విడతలుగా స్వామి వారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. భక్తులు స్పర్శ దర్శనానికి ఆన్లైన్ టికెట్లను అందుబాటులో ఉంచమన్నారు. మల్లన్న  భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆలయ ఈవో డి. పెద్దిరాజు కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..