AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీచర్‌గా మారిన కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు..

ఇప్పటికే అనేక మంది మన్ననలు పొందిన కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తాజాగా ఓ స్కూల్లో టీచర్ గా మారి పాఠాలు చెప్పడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరులోని గానుగులపేటలోని వీరమాచినేని విమలాదేవి నగర పాలక ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు ఎలా పాఠాలు చెబుతున్నారో.. వారు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో.. దగ్గరుండి పరిశీలించారు.

Andhra Pradesh: టీచర్‌గా మారిన కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు..
collector prasanna venkatesh
B Ravi Kumar
| Edited By: Surya Kala|

Updated on: Dec 22, 2023 | 12:10 PM

Share

ఆయనోక జిల్లా కలెక్టర్.. అయితే ఆయన అక్కడ పాఠాలు చెప్పే పంతులయ్యగా మారారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరి తెలుసుకున్నారు ఆ జిల్లా కలెక్టర్.. ఇప్పటికే వైవిద్య భరితమైన అంశాలపై స్పందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పరిపాలనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ అధికారులపై ప్రజలకు నమ్మకంతో పాటు ధైర్యాన్ని పెంచే విధంగా జిల్లాలో ఆయన పాలన సాగుతుంది.

ఇప్పటికే అనేక మంది మన్ననలు పొందిన కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తాజాగా ఓ స్కూల్లో టీచర్ గా మారి పాఠాలు చెప్పడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరులోని గానుగులపేటలోని వీరమాచినేని విమలాదేవి నగర పాలక ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు ఎలా పాఠాలు చెబుతున్నారో.. వారు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో.. దగ్గరుండి పరిశీలించారు. అంతేకాదు ఏకంగా ఆయనే ఉపాధ్యాయుడిగా మారిపోయారు.. కొంచెం సేపు ఆ విద్యార్థులకు పాఠాలు బోధించారు. విన్న పాటలు ఎంతవరకు అర్థమయ్యాయో.. వాటిని వారు ఎలా గ్రహించారో తెలుసుకోవాలనుకున్నారు.. వెంటనే తాను చెప్పిన పాఠం నుంచి కొన్ని ప్రశ్నలు విద్యార్థులని అడిగారు.

ఇవి కూడా చదవండి

ఆ విద్యార్థులు కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పడంతో మురిసిపోయారు. విద్యార్థుల సైతం ఓ జిల్లా కలెక్టర్ తమకు గురువుగా మారి పాఠాలు చెప్పడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన సంగతులన్నీ శ్రద్ధగా విని తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..