Andhra Pradesh: ఏపీలో మళ్లీ కరోనా అలజడి.. సర్కార్ అలెర్ట్
కేరళలో కోవిడ్-19 సబ్‌వేరియంట్ అయిన JN.1 బయటపడిన తరువాత దేశంలో కేసులు పెరగడం మొదలైంది. ఇంతకుముందు ఈ వేరియంట్‌ను అమెరికా, చైనా సహా అనేక దేశాలలో కనుగొన్నారు. జెఎన్.1ను ఎదుర్కోవడానికి కోవిడ్‌కు అనుమతించిన అన్నిరకాల వ్యాక్సిన్‌లు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్ కేసులు నమోదవుతుండగా… రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది..కొత్త వేరియంట్‌పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైంది ప్రభుత్వం..రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై నేడు సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు..వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.
మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు..వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు..కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు..
కాగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, వేరియంట్ తెలుసునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి