Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tablighi Jamaat: తబ్లీగీ జమాత్‌కి సర్కార్‌ నిధుల విడుదలపై వివాదం.. సమావేశాన్ని అడ్డుకుంటామన్న వీహెచ్‌పీ

తబ్లీగీ జమాత్‌కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది. తబ్లిగీ సదస్పు కోసం తెలంగాణ ప్రభుత్వం 2, 45 , 93,847 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులు కేటాయింపు కేంద్రంగా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. తబ్లీగీ జమాత్‌కి నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు.. బీజేపీ శ్రేణులు. మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని  నిలదీస్తున్నారు.

Tablighi Jamaat: తబ్లీగీ జమాత్‌కి సర్కార్‌ నిధుల విడుదలపై వివాదం.. సమావేశాన్ని అడ్డుకుంటామన్న వీహెచ్‌పీ
Taglibi Jamaat
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 22, 2023 | 6:11 PM

మైనార్టీ సభ కేంద్రంగా తెలంగాణలో కొత్త జగడం రాజుకుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా తబ్లీగీ సభకు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు ఆ సంస్థ ప్రతినిధులు. సభకు సర్కార్‌ నిధులు విడుదలను హిందూసంఘాలు, బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనిచెప్పడమే సదస్సు ఉద్దేశమంటున్నారు తబ్లిగీ ప్రతినిధులు. అసలు నిధుల వివాదమేంటి? సభ ఉద్దేశమేంటి వివరాల్లోకి వెళ్తే..

తబ్లీగీ జమాత్‌కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది. తబ్లిగీ సదస్పు కోసం తెలంగాణ ప్రభుత్వం 2, 45 , 93,847 రూపాయలు మంజూరు చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ జారీ చేసిన జీవో-ఆర్‌టీ-123 ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిధులు విడుదల చేశారు. ఈ నిధులు కేటాయింపు కేంద్రంగా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది.

తబ్లీగీ జమాత్‌కి నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు.. బీజేపీ శ్రేణులు. మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని  నిలదీస్తున్నారు. సమావేశాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌. సమావేశం రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిధులు మంజూరు చేసిన సూత్రధారులు ఎవరో తేల్చాలని ట్వీట్‌ చేశారు బండి సంజయ్‌. తబ్లీగీ జమాత్‌కి సర్కార్ నిధులు మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు వీహెచ్పీ. సమావేశాన్ని అడ్డుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సౌదీ సహా పలుదేశాల్లో తబ్లీగీ జమాతే సంస్థపై నిషేధం వుందంటున్నారు పలువురు లాయర్లు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థకు వెనుకాముందు ఆలోచించకుండా సభకు అనుమతి ఇవ్వడమే కాకుండా, మైనార్టీ వెల్ఫేర్‌ నిధులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు అడ్వోకేట్‌ రచనారెడ్డి.

వీళ్ల వర్షన్‌ ఇలా ఉంటే .. తబ్లీగీ జమాతేపై మరోలా స్పందిస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. మానవ సేవే మాధవ సేవ అనిచెప్పడమే తమ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు తబ్లిగ్‌ ప్రతినిధులు. సదస్సు ఏర్పాట్లకు నిధులను తామే సమకూర్చుకున్నామని చెప్పారు. ప్రభుత్వం కేవలం నీటి సరఫరా తదితర సౌకర్యాలను మాత్రమే కల్పిస్తుందన్నారు. హిందూ-ముస్లిమ్‌ భాయ్‌ భాయ్‌ అని చాటడమే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.

మొత్తంగా వికారాబాద్‌ జిల్లాలో జనవరి 6 నుంచి 8 వరకు తబ్లీగీ జమాత్‌ సంస్థ ఆధ్వర్యంలో మైనార్టీ సదస్సు జరుగనుంది. అల్రెడీ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈసమావేశం ఏర్పాట్లు,  భద్రతపై వికారాబాద్ కలెక్టర్ రివ్యూ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..