Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తపాలా కార్యాలయంలో సబ్ పోస్ట్‌మాస్టర్ చేతివాటం.. వ్యసనాలకు బానిసై కోటిన్నర నగదు హాంఫట్‌!

ఆయనో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. కుటుంబం అప్పుల పాలైంది. ఇక తాను పనిచేస్తున్న శాఖలోని ప్రజాధనంపై కన్నేశాడు. ఇంకేముంది ఆ సొమ్మునంతా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. సొంతానికి వాడుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు కోటి రూపాయలను స్వాహా చేశాడు. వివరాల్లోకెళ్తే.. నల్లగొండ జిల్లా హలియా మండలం హజారి గూడెంకు చెందిన పేరుమళ్ల రామకృష్ణ నేషనల్ చెస్ ఛాంపియన్...

Hyderabad: తపాలా కార్యాలయంలో సబ్ పోస్ట్‌మాస్టర్ చేతివాటం.. వ్యసనాలకు బానిసై కోటిన్నర నగదు హాంఫట్‌!
Suspended Sub Postmaster
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Dec 22, 2023 | 12:03 PM

నల్లగొండ, డిసెంబర్‌ 22: ఆయనో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. కుటుంబం అప్పుల పాలైంది. ఇక తాను పనిచేస్తున్న శాఖలోని ప్రజాధనంపై కన్నేశాడు. ఇంకేముంది ఆ సొమ్మునంతా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. సొంతానికి వాడుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు కోటి రూపాయలను స్వాహా చేశాడు. వివరాల్లోకెళ్తే.. నల్లగొండ జిల్లా హలియా మండలం హజారి గూడెంకు చెందిన పేరుమళ్ల రామకృష్ణ నేషనల్ చెస్ ఛాంపియన్. నాలుగేళ్ల క్రితం స్పోర్ట్ కోటాలో తపాలా శాఖలో సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం సాధించాడు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన రామకృష్ణ రెండేళ్ళ క్రితం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ మాస్టర్‌గా బదిలీపై వచ్చాడు.

తండ్రి పెరుమళ్ల వెంకటేశ్వర్లు 2014 లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో తండ్రి చేసిన అప్పుల నుంచి తేరుకోకుండానే.. రామకృష్ణ ఆన్ లైన్, బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఖాతాదారుల సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. ఖాతాదారులు దాచుకునే డబ్బుతో పాటు ఆర్డీ (రికరింగ్ డిపాజిట్లు) కట్టే డబ్బులు కూడా ఖాతాదారుల పాసు పుస్తకాలు, ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. కంప్యూటర్ పనిచేయడం లేదని, తర్వాత రాసి ఇస్తానని చెబుతూ వచ్చాడు. ఖాతాదారులు అతడిపై నమ్మకంతో సరేనని ఊరుకున్నారు. జల్సాలు, ఆన్లైన్ బెట్టింగులతో పక్కదారి పట్టి కోటిన్నర రూపాయలు నష్టపోయినట్లు తెలిసింది.

అయితే కొద్ది రోజులుగా రామకృష్ణ సెలవులో ఉన్నాడు. దీంతో హిల్ కాలనీలో పనిచేస్తున్న మరో సబ్ పోస్ట్ మాస్టర్ రంగయ్య ఇన్ చార్జిగా వచ్చారు. పోస్టాఫీసులో తాము జమచేసిన నగదు, ఖాతాలో ఉన్న నగదులో తేడా ఉందని కొందరు ఖాతాదారులు రంగయ్యకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దేవరకొండ పోస్టల్ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ పోస్టాఫీసు రికార్డులను పరిశీలించడంతో అవినీతి వెలుగు చూసింది. రెండు రోజుల విచారణలో అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణను సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతోందని, కోటి రూపాయల పైనే అవకతవకలు జరిగిఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖాతా దారుల సొమ్ముకు తపాలాశాఖ పూర్తి బాధ్యత వహిస్తుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. విచారణ అనంతరం సదరు సబ్ పోస్ట్ మాస్టర్ వద్ద నుంచి కాజేసిన సొమ్మును రికవరీ చేస్తామని పోస్టల్ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.