Hyderabad: నిలోఫర్‌లో 15 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ
నిలోఫర్లో 15 నెలల బాబుకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. నాంపల్లికి చెందిన ఓ బాబుకి కోవిడ్ పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది. బుధవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కేంద్రం ఆదేశాల మేరకు చికిత్స కోసం వచ్చినటువంటి చిన్న పిల్లలకు కూడా కోవిడ్ టెస్ట్‌లు చేస్తున్నట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా..
హైదరాబాద్, డిసెంబర్ 22: నిలోఫర్లో 15 నెలల బాబుకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. నాంపల్లికి చెందిన ఓ బాబుకి కోవిడ్ పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది. బుధవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కేంద్రం ఆదేశాల మేరకు చికిత్స కోసం వచ్చినటువంటి చిన్న పిల్లలకు కూడా కోవిడ్ టెస్ట్‌లు చేస్తున్నట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచామన్నారు. అందులో 120 ఆక్సిజన్లతో కూడినటువంటి బెడ్స్ ఉన్నాయని తెలిపారు.
ఈ సీజన్లో నుమోనియాతో బాధపడుతున్న చిన్నపిల్లలు ఎక్కువగా వస్తారని, అటువంటి వారిని సపరేట్‌గా ఉంచి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాలలో చిన్నపిల్లలను దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. జనాలతో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో త్వరగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. కాగా కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.