Telangana: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ.. 2 శాతం పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్

ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయింది. ఈ ఏడాది 24, 821 FIR లు నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ క్రైమ్ రేట్ 2 శాతం పెరిగింది. 9 శాతం దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై..

Telangana: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ.. 2 శాతం పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్
Telangana Year Ending Crime Review
Follow us

|

Updated on: Dec 24, 2023 | 6:25 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయింది. ఈ ఏడాది 24, 821 FIR లు నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ క్రైమ్ రేట్ 2 శాతం పెరిగింది. 9 శాతం దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 శాతం నేరాలు తగ్గాయి. వివిధ కేసులో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు, పొగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది హత్యలు 79, రేప్ కేసులు 403, కిడ్నాప్‌లు 242, చీటింగ్ కేసులు 4909 నమోదు అయ్యాయి.

ఇక రోడ్డు ప్రమాదాలు 2637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 ఆయా పోలీస్‌ స్టేషన్లలో నమోదు అయ్యాయి . ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు శిక్షలు విధించడం జరిగింది. 13 కేసులో 13 మందికి కోర్టులు జీవిత ఖైదీ శిక్షలు విధించాయి. 4465 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 శాతం పెరిగిన అత్యాచారం కేసులు పెరిగాయి. మత్తు పదార్థాలు వాడిన 740 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు పట్టుబడ్డారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా వెతికి వెతికి అరెస్ట్ చేస్తాం. డ్రగ్స్ సప్లై , డిమాండ్ పై ఫోకస్ పోలీస్‌ యంత్రంగం దృష్టి సారించింది. గల్లీలో గంజాయిపై కూడా నిఘా పెరిగింది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

సైబర్‌ నేరాల విషయాని కొస్తే గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 శాతం సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా రూ. 401 కోట్లు మోసాలు జరిగినట్లు తెలిపారు. మల్టిలెవల్ మార్కెటింగ్‌లో రూ. 152 కోట్లు మోసాలు జరిగాయన్నారు. ఆర్థిక నేరాల్లో రూ.10 వేల కోట్లు కు పైగా మోసం జరిగినట్లు తెలిపారు. ల్యాండ్ స్కామ్ లల్లో 245 మందిని అరెస్ట్ చేశామన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన వారిలో 650 మందిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు