కోవిడ్-19
కోవిడ్-19.. దీన్ని కరోనా వైరస్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఈ వైరస్ మొదటిసారిగా 2019లో చైనాలోని వుహాన్‌లో గుర్తించారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ప్రాణాంతక వైరస్ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
COVID-19 యావత్ ప్రపంచంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా లక్షణాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు వైద్య పరిశోధనలు, వ్యాక్సిన్ల ప్రభావంతో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా ప్రపంచ దేశాలు ముందడుగు వేసినా.. ఈ వైరల్ వ్యాధి వ్యాప్తి భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లతో ఈ వ్యాధి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లు భారత్ సహా పలు దేశాల్లో ఉద్భవించాయి.
ఇటీవలే కొత్త సబ్ వేరియంట్ JN.1 అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌ను భారతదేశంలోనూ గుర్తించారు. ఈ వ్యాధి సోకిన మొదటి కేసు కేరళలో గుర్తించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా JN.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
దగ్గు లేదా తుమ్మడం వల్ల కలిగే శ్వాసకోశ కణాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కరోనా వైరస్ వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. దాని వైరస్ చాలా కాలం పాటు ఉపరితలంపై సజీవంగా ఉంటుంది. ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది