ఔట్‌డేటెడ్ కాదు.. అప్‌డేటెడ్.. కలవరపెడుతున్న కొత్త వేరియెంట్.. మళ్లీ వ్యాక్సిన్లు తప్పవా?
'కొవిడ్ కేసులు 4వేలు' అని ఓ బ్రేకింగ్ న్యూస్ స్టైల్‌లో చెప్పగానే.. 'గతంలో లక్షల కేసులు చూశాం నాలుగువేలకే ఎందుకంత కంగారు' అని అనాలనిస్తోంది కదా. నిజమే.. కంగారు పడాల్సిన అవసరమే లేదు. బట్.. ఓ డేటా చెబుతా వినండి. జనవరిలో ఒక కొవిడ్ కేసు. ఫిబ్రవరి మొత్తం మీద ఒక కేసు. మార్చిలో అయితే జీరో. ఒక్క కొవిడ్ కేసు లేదు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా జస్ట్ నాలుగు యాక్టివ్ కేసులు. ఈ లెక్కన మే నెల నెంబర్ ఎంత ఉండొచ్చని మీ అంచనా. ఊహించలేరు. ఏకంగా 503.

కరోనానా.. మాకేం భయం అంటున్నారంతా..! అదంతా పైపైకే. లోలోన మాత్రం ప్రపంచం భయపడుతోంది. కొరియా, జపాన్, హాంకాంగ్‌లోని ఫార్మా కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. కొవిడ్ విజృంభణ చూసి.. ఇది ఇప్పట్లో నెమ్మదించేలా లేదని అర్థమైంది కాబట్టే ఫార్మా షేర్లలో ఆ పెరుగుదల. ప్రస్తుతం LF-7, NB-1.8.1 అనే వేరియెంట్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. బట్.. కరోనా వైరస్‌లోని JN-1 వేరియెంట్‌కు సంబంధించి ఏకంగా 30 మ్యుటేషన్లున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన మ్యాటర్ ఇది. అలా అని కంగారు పడిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. అదే సమయంలో నిర్లక్ష్యం అస్సలే వద్దు. సైలెంట్‌గా.. ఈ ఇయర్‌లో 37 మందిని పొట్టన పెట్టుకుంది కాబట్టి.. జాగ్రత్తలు కచ్చితంగా అవసరమే. కరోనా ‘ఒక్క’ కేసుతోనే మొదలైంది మన దేశంలో..! కేరళలో మొదటిసారి బయటపడినప్పుడు.. ఒక్కటే అనుకున్నాం, అదే సమయంలో మనదేశంలోకీ వచ్చేసిందా అని భయపడిపోయాం. కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోవడంతో గజగజ వణికిపోయాం. వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోలేదు ఆ భయం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ కాబోతోందా..? భారత్‌లో జస్ట్ 24 గంటల్లోనే 864 కరోనా పాజిటివ్ కేసులు బయటపడడం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కానే కాదు. భారత్‌లో కేసుల సంఖ్య నాలుగువేల దగ్గరే ఉండొచ్చు. కాని, పలు దేశాల్లో ఇలా లేదు. ఎగ్జాంపుల్‌గా ఓ లెక్క చెప్పుకుందాం. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు.. అంటే ఒకవారంలో.. ఏకంగా 14వేల...




