AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..! యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది.

India Covid-19: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..! యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..
India Coronavirus Cases
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2025 | 8:24 AM

Share

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది. భారత్‌లో ఎన్‌బీ 1.8.1, ఎల్‌ఎఫ్‌ 7, అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని.. వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ.. జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్‌ అయిన ఎన్‌బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది.

అయితే.. కోవిడ్ 19 కేసుల పెరుగుదలకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు వైద్య నిపుణులు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి అంశాల ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. దేశంలోని అనే నగరాల్లో సీజనల్‌ ఫ్లూ, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడం కూడా కరోనా వ్యాప్తికి కారణం కావొచ్చన్నారు. వ్యాప్తి తక్కువ అయినప్పటికీ అలెర్ట్‌గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.

ఇదిలావుంటే.. దాదాపు 43శాతం కేసులతో కేరళ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. 21శాతం కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో..ఢిల్లీ, గుజరాత్‌ , తమిళనాడు ఉన్నాయి. కేరళను కరోనా కేసులు మరోసారి వణికిస్తు్న్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 519 కేసులు నమోదు అయినట్లు, మూడు మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కేసులు పెరుగుదలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్‌. ఈ సందర్భంగా.. కేసుల పెరుగుదలతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులు వేగవంతం చేయాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..