AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ నుంచి సీఆర్పీఎఫ్ జవాన్‌కు డబ్బులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు..

పాక్‌కు గూడచారిగా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ ఉద్యోగిని అరెస్టు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ .. మరిన్ని వివరాలను రాబట్టింది. సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)గా పనిచేస్తున్న మోతీ రామ్‌ జాట్‌.. 2023 నుంచి పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్‌తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ నుంచి సీఆర్పీఎఫ్ జవాన్‌కు డబ్బులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు..
National Investigation Agency
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2025 | 7:55 AM

Share

దాయాది పాకిస్థాన్ దేశానికి గూఢచార్యం చేస్తోన్న స్పైల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దేశ సున్నిత, రహస్య సమాచారం పాక్‎కు చేరవేశారన్న ఆరోపణలపై హర్యానా, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్‌గా ఇవే తరహా ఆరోపణలపై CRPF సిబ్బంది మోతీ రామ్ జాట్‌‎ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితుడి నుంచి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏఐ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఎన్ఐఏ అభ్యర్థన మేరకు మోతీ రామ్‎ను కోర్టు జూన్ 6 వరకు కస్టడీకి అప్పగించింది.

పాక్‌కు గూడచారిగా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ ఉద్యోగిని అరెస్టు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ .. మరిన్ని వివరాలను రాబట్టింది. సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)గా పనిచేస్తున్న మోతీ రామ్‌ జాట్‌.. 2023 నుంచి పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్‌తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ కు అందజేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా పహల్గామ్ ఉగ్ర దాడికి ఆరు రోజుల ముందు వరకు మోతీరామ్ పహల్గామ్ లో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత జాట్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ నుంచి బదిలీ చేశారు. ఈ సంఘటనతో అతని సంబంధాలను NIA ఇప్పుడు పరిశీలిస్తోంది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివిధ రూపాల్లో నగదు అందుకున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జూన్ ఆరో తేదీ వరకు మోతీరాంను విచారించి.. మరిన్ని వివరాలను సేకరించనుంది.

కాగా.. పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సిందూర్ అనంతరం.. పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసింది.. ఇప్పటికే.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..