తెలుగుతో పాటు తమిళ్ లోనూ దూసుకుపోతున్న కుర్ర భామ..
Rajeev
09 march 2026
ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హవా కనిపిస్తుంది. మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
వారిలో అందాల భామ శాన్వి మేఘన ఒకరు. ఈ ముద్దుగుమ్మ 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
ఆ తర్వాత “పిట్ట కథలు”, “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది .
ఈ వయ్యారి భామ. “పుష్పక విమానం”లో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్‌గా చేసిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ వయ్యారి భామ. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో చివరిగా గా టుక్ టుక్ అనే సినిమా చేసింది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.